BIG BREAKING: దుండగుల కాల్పుల్లో 12 మంది మృతి

మెక్సికోలో దుండగులు రెచ్చిపోయారు. గ్వానాజువాటోలో స్థానికంగా జరుపుకునే సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ వేడుకలో ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ విషాద ఘనటలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

New Update
Mexicos Guanajuato

మెక్సికోలో దుండగులు రెచ్చిపోయారు. గ్వానాజువాటోలో స్థానికంగా జరుపుకునే సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ వేడుకలో ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ అనేది ఇరాపువాటోలో జరుపుకునే స్ట్రీట్ సెలబ్రేషన్స్. ఇందులో స్థానికులు మద్యం చేస్తూ.. డ్యాన్స్ చేస్తుంటారు. ఆ సమయంలో కొంతమంది గన్స్‌తో వచ్చి కాల్పులు జరిపారు. ఈ విషాద ఘనటలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

గత నెలలో గ్వానాజువాటోలో శాన్ బార్టోలో డి బెర్రియోస్‌లో జరిగిన కాథలిక్ చర్చి కార్యక్రమంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. మెక్సికో నగరానికి వాయువ్యంగా ఉన్న గ్వానాజువాటో రాష్ట్రంలో నేరస్థుల మధ్య జరుగుతున్న టర్ఫ్ యుద్ధాల కారణంగా అది అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో ఒకటిగా మారింది. గ్వానాజువాటో రాష్ట్రంలో 2025 మొదటి ఐదు నెలల్లో 1,435 హత్యలు జరిగాయి. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు