Cargo Ship : నీట మునిగిన కార్గోషిప్...షిప్ లో 3 వేల కార్లు

3వేల కార్లతో మెక్సికోకు వెళుతున్న ఓ నౌక ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలో మునిగిపోయింది. ముందుగా నౌకలో మంటలు చెలరేగాయని, అనంతరం సముద్రంలో మునిగిపోయిందని నౌకాసంస్థ తెలిపింది. నౌకలో ఉన్న 3వేల కార్లలో 800 వరకు ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నాయి.

New Update
Cargo ship sinks

Cargo ship sinks

Cargo Ship:  3వేల కార్లతో మెక్సికోకు వెళుతున్న ఓ నౌక ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలో మునిగిపోయింది. ముందుగా నౌకలో మంటలు చెలరేగాయని, అనంతరం సముద్రంలో మునిగిపోయిందని నౌకాసంస్థ తెలిపింది.  ఈ రవాణా నౌక మొత్తం 3వేల కార్లతో బయలుదేరింది. వాటిలో 800 వరకు ఎలక్ట్రిక్‌ కార్లు ఉన్నాయి. అలస్కాలోని  అలూటియన్‌ దీవులకు సమీపంలో ఈ నౌక మునిగిపోయినట్లు లండన్ కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్‌ మారిటైమ్‌ స్పష్టం చేసింది.

ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?

 జూన్‌ 3న ఈ రవాణా నౌకలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యూఎస్ కోస్ట్‌ గార్డ్‌ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ సమయంలో ఓడలో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిసిందన్నారు. అయితే వారంతా లైఫ్‌ బోట్‌ ద్వారా ఒయటపడినట్లు వివరించారు. లైఫ్‌ బోటులో ఉన్నవారిని సమీపంలోని మర్చంట్‌ మెరైన్‌ నౌక రక్షించిందని తెలిపారు. ఓడలో వెనక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉన్నాయన్నారు. అయితే వాటిలో సమస్య వల్ల పెద్ద మొత్తంలొ పొగలు వ్యాపించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కోస్ట్‌ గార్డు అధికారులు, నౌకా సంస్థ స్పష్ట చేశాయి.


ఈ ఓడ నీటమునిగినప్పటికీ ఎలాంటి కాలుష్యం ఏర్పడలేదని యూఎస్‌ కు చెందిన కోస్ట్‌ గార్డ్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.ఒకవేళ కాలుష్యం ఏర్పడిన అది విస్తరించకుండా ఉండటం కోసం కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన రెండు సాల్వేజ్‌ టగ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 

Advertisment
తాజా కథనాలు