Mexico: మెక్సికోలో కూలిన విమానం...ముగ్గురు మృతి

 దక్షిణ మెక్సికోలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గ్వాటెమాలన్ పైలట్లు, ఒక మెక్సికన్ సిబ్బంది మరణించారని విమానయాన అధికారులు తెలిపారు.

New Update
flight

Mexico Flight

 స్క్రూవార్మ్ ఈగల వ్యాప్తిని అరికట్టే క్రమంలో దక్షిణ మెక్సికోలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాటెబాలన్ నుంచి బయలుదేరిన చిన్న విమానం మెక్సికోలో కూలిపోయింది. స్క్రూవార్మ్ ఈగలను వదులుతుండగా విమానం కూలిపోయింది. మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ స్క్రూవార్మ్ ఫ్లై వ్యాప్తిని నివారించడానికి కలిసి పనిచేస్తున్నాయి, దీని లార్వా పశువులను చంపేస్తుంది. ఇందులో ఇద్దరు పైలెట్లు, ఒక మెక్సికన్ సిబ్బంది మరణించారని అధికారులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు