Whatsapp: వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
మెటా ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ పై చాలా పెద్ద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు మార్క్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చైనాతో చేతులు కలిపి అమెరికన్ల మోసం చేస్తున్నారని ఆరోపించారు.
టీనేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌పై మెటా పేరెంట్ కంట్రోలింగ్ పెంచింది. నగ్నత్వం, సెన్సిటివ్ కంటెంట్ లైవ్ స్ట్రీమింగ్కు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరిచేసింది. న్యూడ్ చిత్రాలపై అటోమెటిక్‌గా వచ్చే బ్లర్ మాస్క్ తీసేయాలన్నా పేరెంట్స్ పర్మిషన్ అవసరం.
ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం..సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సంచలనం. అందుకే ఆయనకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన ఎవరో కాదు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
డొనాల్ట్ ట్రంప్ తో మెటా తన సంబంధాలు మెరుగుపరుచుకొనే పనిలో పడింది.క్యాపిటల్ భవనం పై దాడి సమయంలో ఆయన ఫేస్బుక్, ఇన్ స్టా గ్రామ్ ఖాతా పై నిషేధం విధించింది. ట్రంప్ దావా వేయడంతో 25 మిలియన్ డాలర్లకు ఆ సంస్థ సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికలకు సంబంధించి ఇటీవల మార్క్ జూకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటా సంస్థ స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. మెటా కంపెనీకి భారత్ ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కరోనాని సరిగా నిర్వహించలేదని భారత్‌తో సహా అనేక దేశాలు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని మెటా సీఈఓ జుకర్ బర్గ్ ఓ పోర్డ్‌కాస్ట్‌లో అన్నాడు. ఈ వ్యాఖ్యలపై జుకర్ బర్గ్ ఇండియా పార్లమెంట్, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
భారత్‌తో సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓడిపోయాయని మర్క్ జూకర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. జూకర్బర్గ్ తప్పుగా చెప్పారని.. భారత్‌లో ప్రజలు ఎన్డీయేపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘన, వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 85 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది.