Mark Zukerberg: ట్రంప్ డిజిటల్ పన్నుల ఆగ్రహం వెనుక మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్?

అమెరికా టెక్ కంపెనీలపై డిజిటల్ ట్యాక్స్ విధిస్తున్న దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ రీసెంట్ గా విరుచుకుపడ్డారు. వారిపై అదనపు సుంకాలతో దాడి చేస్తామని బెదిరించారు. దీని వెనుక మెటీ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

New Update
Zuker

US President Donald Trump and Meta CEO Mark Zuckerberg

అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలపై పలు దేశాలు డిజిటల్ ట్యాక్స్(Digital Tax) విధిస్తున్నాయి. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పెద్ద పోస్ట్ రాశారు. అమెరికన్ టెక్ కంపెనీలపై దాడి చేసే దేశాలను తాను ఎదుర్కొంటానని ట్రంప్ అన్నారు. ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్, మెటాకు చెందిన ఫేస్‌బుక్, ఆపిల్ మరియు అమెజాన్ వంటి అమెరికన్ సంస్థలపై అన్యాయంగా ట్యాక్స్ లు విధిస్తున్నారన్నారు. డిజిటల్ పన్నులు, డిజిటల్ సేవల చట్టం, డిజిటల్ మార్కెట్ల నిబంధనలు, డిజిటల్‌ మార్కెట్‌ రెగ్యులేషన్స్‌(Digital Market Regulations) అన్నీ అమెరికన్ టెక్నాలజీకి హాని కలిగించడానికి లేదా వివక్ష చూపడానికి రూపొందించబడ్డాయని విరుచుకుపడ్డారు.  చైనా వంటి మిగతా దేశాలపై ఈ పన్నులు వేయడం లేదని...కేవలం యూఎస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారననున్నారు.  అమెరికా టెక్ కంపెనీలు(US Tech Companies) ఏమీ మీ పిగ్గీ  బ్యాంకులు కావంటూ మండిపడ్డారు ట్రంప్.  తమ దేశంలో ఉన్న టెక్ కంపెనీలను గౌరవించాలని..లేదంటూ తాను తీసుకునే నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 

Also Read :  అమెరికాలో కత్తితిప్పిన సిక్కు వ్యక్తి...ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు

డిజిటల్ పన్నుల బెదిరింపుల వెనుక జుకర్ బర్గ్..

ట్రంప్ ఈ మండిపాటు వెనుక అసలు కారణం మెటీ సీఈవో మార్గ జుకర్ బర్గ్ అని అంటున్నారు. ఆయనతో అమెరికా అధ్యక్షుడు ప్రైవేట్ సమావేశం తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇందులో మెటా దేశీయ మౌలిక సదుపాయాలు పెట్టుబడులు, విదేశాలలో అమెరికన్ టెక్ కంపెనీల లీడర్ షిప్ ను మరింత పెంచడం లాంటి అంశాలపై ట్రంప్ జుకర్(Mark Zukerberg) చర్చించారు. దాంతో పాటూ ఈ సమావేశంలో మార్క్ డిజిటల్ సర్వీస్ పన్నుల గురించి ఆందోళన లేవనెత్తారని తెలుస్తోంది. దీని తర్వాతనే ట్రంప్ డిజిటల్ పన్నులు(Trump Digital Taxes) విధిస్తున్న దేశాలపై కొత్త వాణిజ్య పన్నులు విధిస్తానని బెదిరించారు. అదే సమయంలో చైనాకు మాత్రం ఈ  పన్నుల మినహాయింపు ఇచ్చారు. దాంతో ఆ దేశపు కంపెనీలకు పూర్తి అనుమతినిచ్చారు. అయితే ఈ డిజిటల్ పన్నులపై ఆందోళన వ్యక్తం చేయడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు మెటా, అమెజాన్ సంస్థలు డిజిటల్ పన్నులపై ఆందోళన వ్యక్తం చేశాయి. తమ కంపెనీలపై అన్యాయంగా పన్నులు విధిస్తున్నారని వాదిస్తున్నాయి. 

డిజిటల్ పన్నులంటే ఏంటి?

డిజిటల్ పన్నులు ఇవి ప్రభుత్వాలు విధించేవి. అమెజాన్, మెటా వంటి పెద్ద కంపెనీలపై ఆయా దేశ ప్రభుత్వాలు పన్నులు విధిస్తాయి. వీటి వలన దేశాలకు అదనపు డబ్బులు వస్తాయి. తమ వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థలకు లాభం చేకూరుతుందని మెటా, అమెజాన్ లాంటివి వాదిస్తున్నాయి.  అయితే ఇవి కేవలం అమెరికన్ కంపెనీల మీదనే వేస్తున్నారు..చైనా వంటి దేశాల నుంచి వచ్చిన కంపెనీల మీద లేదని ఆరోపిస్తున్నారు. డిజిటల్ పన్నును వాణిజ్య ఆయుధం కింద మార్చుకుంటున్నారని అంటున్నారు.  యూరప్, ఆసియాల్లో ఇవి ఎక్కువగా అమలు అవుతున్నాయి. ఇప్పుడు కెనడా వంటి దేశాలు కూడా దీనిపై ప్రతిపాదనను తీసుకువచ్చాయి. వీటిని వాషింగ్టన్ ఒప్పుకోవడం లేదు. దాంతో పాటూ ఇప్పటికే డిజిటల్ పన్ను వేస్తున్న దేశాలపై చర్యలు తీసుకునేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. 

Also Read :  దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం... పాస్‌పోర్ట్‌ రూల్స్ మార్చేసింది!

Advertisment
తాజా కథనాలు