/rtv/media/media_files/2025/07/31/ex-openai-employee-rejects-1-billion-offer-from-mark-zuckerberg-to-join-meta-ai-2025-07-31-15-46-46.jpg)
Ex-OpenAI Employee rejects 1 billion offer from Mark Zuckerberg to join Meta AI
Meta AI:
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రంగాల్లోకి ఏఐ విస్తరించింది. చాలావరకు ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసింది. ఇంకా చేస్తోంది. అయితే ఏఐ స్కిల్స్ ఉన్నవారని టెక్ దిగ్గజాలు భారీ ప్యాకేజ్‌లతో ఆఫర్లు ఇచ్చి తీసుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ ఏఐ స్టార్టప్ కంపెనీలో ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను లాక్కునేందుకు మెటా యత్నించింది. కానీ ఆ సంస్థ యజమాని 'మీరా మురాటీ' తమ ఉద్యోగులను విడిచిపెట్టలేదు. ఓ ఉద్యోగికి మెటా 1 బిలియన్ డాలర్లు (8,750 కోట్లు) ఆఫర్ చేసినా అతడు ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేయడం విశేషం.
Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్ టారిఫ్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
ఓ అంతర్జాతీయ మీడియా కథనం తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది ఫిబ్రవరిలో మీరా మురాటీ అనే మహిళా థింకింగ్ మెషిన్స్ ల్యాబ్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీలో 30 మంది ఏఐ నిపుణులను ఆమె నియమించుకుంది. వీళ్లందరూ కూడా గతంలో ఓపెన్ఏఐ, మెటా, మిస్ట్రాల్ వంటి ఏఐ సంస్థల్లో పనిచేసిన వీళ్లే. అయితే ఈ థింకింగ్ మెషిన్స్ ల్యాబ్‌లో పనిచేస్తున్న ఏఐ నిపుణుల సామర్థ్యానికి మెటా సంస్థ ఫిదా అయిపోయింది. దీంతో అందులో పనిచేసే ఉద్యోగులకు తమ కంపెనీలోకి రప్పించేందుకు యత్నించిది. 10 మందికి పైగా భారీ ఆఫర్లు ఇచ్చింది.
200 మిలియన్ల డాలర్లు నుంచి 500 మిలియన్ల డాలర్ల వరకు ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది. ఓ ఉద్యోగికి 1 బిలియన్ డాలర్లు (రూ.8,755) కోట్లు ఇచ్చేందుకు రెడీ అయింది. అంతేకాదు స్వయంగా మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ కూడా కొంతమంది ఉద్యోగులతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. కానీ థింకింగ్ మెషిన్స్ ల్యాబ్ నుంచి ఏ ఉద్యోగి కూడా మెటాలోకి వెళ్లలేదు. మెటా ఆకర్షణీయమైన ప్యాకేజ్ ఆఫర్ చేసినప్పటికీ వాళ్లు మీరా మురాటీపై నమ్మకంతో తమ కంపెనీని వీడలేదు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే థింకింగ్ మెషిన్స్ ల్యాబ్ పెట్టి ఏడాది కూడా కాలేదు. దీని నుంచి ఇంకా ఏ ప్రొడక్ట్ కూడా ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. అయినా కూడా ఆ కంపెనీ మెటాను ఆకర్షించింది. ప్రస్తుతం థింకింగ్ ల్యాబ్ కంపెనీ విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది.
Also Read: భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఈ ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం
మీరా మురాటీ అల్బేనియాలో జన్మించారు. పాఠశాల చదువు అక్కడే పూర్తి చేశారు. పై చదువుల కోసం కెనడాకు వెళ్లారు. అక్కడ చదువు పూర్తయ్యాక 2011లో గోల్ట్‌మన్ శాక్స్‌లో ఇంటర్న్‌గా ఉద్యోగం ప్రారంభించారు. అనంతరం టెస్లాలో మూడేళ్లు పనిచేశారు. ఆ కంపెనీ డెవలప్ చేసిన మోడల్ ఎక్స్ ఈ కారుకు ఆమె సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా కూడా ఉన్నారు. ఆ తర్వాత లీప్ మోషన్ అనే వర్చువల్ రియాల్టీ కంపెనీలో రెండేళ్లు పనిచేశారు. ఆమెకు ఏఐపై మరింత ఆసక్తి పెరగడంతో 2018లో ఓపెన్‌ఏఐ కంపెనీలో కూడా చేరారు. అక్కడ వైస్ ప్రెసిడెంట్‌గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. ఒకసారి ఆ కంపెనీకి తాత్కాలిక CEOగా కూడా ఉన్నారు. చివరికి అందులో నుంచి కూడా వెళ్లిపోయి.. 2024లో సొంతంగా థింకింగ్ మెషిన్స్ ల్యాబ్‌ను స్థాపించారు.