Meta: వివాదంలో ఇరుక్కున్న మెటా.. సెలబ్రిటీల అసభ్యకరమైన ఫొటోలపై విమర్శలు

మెటా సంస్థ తాజాగా చిక్కుల్లో పడింది. ఆ కంపెనీ రూపొంచిందిన ఏఐ అసిస్టెంట్ మెటా ఏఐ చాట్‌బోట్స్‌ వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూజర్లతో సంభాషణల కోసం ప్రముఖుల పేర్లు, ఫొటోలను వాడి మెటా AI పేరడీ చాట్‌బోట్‌లను రూపొందించినట్లు తెలిసింది.

New Update
Meta

Meta

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం రోజురోజుకు పెరిగిపోతంది. ఇప్పటికే అనేక రంగాల్లోని కంపెనీలు ఏఐ సేవలు వినియోగించుకుంటున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి దిగ్గజ టెక్‌ కంపెనీలు ఏఐ సేవలు అందిస్తున్నాయి. అయితే మెటా సంస్థ తాజాగా చిక్కుల్లో పడింది. ఆ కంపెనీ రూపొంచిందిన ఏఐ అసిస్టెంట్ మెటా ఏఐ చాట్‌బోట్స్‌ వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూజర్లతో సంభాషణల కోసం ప్రముఖుల పేర్లు, ఫొటోలను వాడి మెటా AI పేరడీ చాట్‌బోట్‌లను రూపొందించినట్లు తెలిసింది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్‌ తన పరిశోధనలో ఈ అంశాన్ని గుర్తించింది. ప్రస్తుతం ఈ అంశం వివాదంగా మారింది.   

Also Read: ట్రంప్ టారిఫ్‌లు, అమెరికా వీసా ఆంక్షలు.. తిప్పికొట్టడానికి ఇండియా మాస్టర్ ప్లాన్ ఇదే!

ఇప్పటికే వాట్సస్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌లలో మెటాకు చెందిన ఏఐ చాట్‌బాట్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేవల్లో ప్రముఖ సింగర్ టేలర్‌ స్విఫ్ట్‌, సెలీనా గోమెజ్, అన్నే హాత్వే, స్కార్లెట్‌ జాన్సన్ వంటి ప్రముఖుల పేర్లతో పేరడీ చాట్‌బాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా ప్రముఖులు, సెలబ్రిటీల పర్మిషన్ లేకుండానే వాటిని రూపొందించారు. టేలర్‌ స్విఫ్ట్‌ పేరుతో మూడు చాట్‌బాట్‌లు ఉన్నాయని.. మెటా ఉద్యోగే వాటిని ఏర్పాటు చేసినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. 

Also Read: ప్రధాని మోదీకి జపాన్ అరుదైన కానుక..చంద్రయాన్ 5 తో పాటూ పలు కీలక ఒప్పందాలు

కొన్నివారాల పాటు ఈ చాట్‌బాట్‌ల వినియోగం సాగిందని తెలిపింది. ఇందులో తామే ప్రముఖులమని పేర్కొంటూ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా కలిసేందుకు ఆహ్వానాలు కూడా పంపించేవాళ్లని చెప్పింది. అంతేకాదు ప్రముఖులకు సంబంధించి పలు అసభ్యకరమైన ఫొటోలు కూడా జనరేట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. మెటాపై విమర్శలు వస్తున్నాయి.  

Also Read: డీమార్ట్‌లో మీ ప్రొడక్ట్స్ అమ్మాలని అనుకుంటున్నారా.. అయితే ఈ అద్భుతమైన అవకాశం మీ కోసమే!

ఈ వివాదంపై మెటా ప్రతినిధి ఆండీ స్టోన్‌ స్పందించారు. మిగిలిన ఏఐ చాట్‌బాట్‌ల మాదిరిగానే తాము కూడా ప్రముఖుల చిత్రాలను రూపొందించేందుకు పర్మిషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. తమ కంపెనీ రూల్స్‌ ప్రకారం ఇలా అసభ్యకరమైన చిత్రాలు రూపొందించడం నిషేధమని చెప్పారు. అయితే ఈ చాట్‌బాట్‌ల వ్యవహారంపై రాయిటర్‌ కథనాన్ని ప్రచూరించడానికి ముందుగానే మెటా చాలావరకు పేరడి బాట్‌లను తొలగించినట్లు సమాచారం. ఈ విషయంపై ఆండీ స్టోన్ మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. 

Also Read: త్వరలో వచ్చేస్తున్న జియో ఐపీఓ.. మెటాతో కలిసి సరికొత్త ఏఐ కంపెనీ !

Advertisment
తాజా కథనాలు