/rtv/media/media_files/2025/01/15/wCFUO9GgkfEmEatGUb3y.jpg)
meta
మెటా సంస్థ అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్ ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో గుత్తాధిపత్యం కోసమే ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లను కొనుగోలుచేశారంటూ యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చేసిన ఆరోపణలను మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తోసిపుచ్చారు. కంపెనీలలో విలువను చూసి తాను వాటిని కొనుగొలు చేశానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో బుదశారం ఎఫ్‌టీసీలో జుకర్ బర్గ్ విచారణ ముగిసింది.
Also Read: కోనోకార్పస్ మొక్కల తొలగింపు.. GHMC కీలక ఆదేశాలు!
విచారణ సందర్భంగా అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు జుకర్ బర్గ్ బదులిచ్చారు. చైనాకు చెందినటిక్ టాక్ తో పాటు యూట్యూబ్ నుంచి ఎలాంటి పోటీని ఎదుర్కొంటున్నారని ఆయన్ని ప్రశ్నించారు. దీనికి మెటా అధినేత బదులిస్తూ..యూజర్లు, ఫేస్‌బుక్,ఇన్ స్టాగ్రామ్ కంటే టిక్ టాక్ నే ఎక్కువగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read: Trump-Tariffs: టారిఫ్ ల ఆదాయమే ముద్దంటున్న ట్రంప్!
Zuckerberg Investigation Ends
యూట్యూబ్ ను వీడియోల కోసం మాత్రమే రూపొందించిందని తెలిపారు. ఈ సందర్భంగా తాను ,తన బృందం కొత్త విషయాలు కనిపెట్టడం పై దృష్టిసారించిందన్నారు. ఇన్‌స్టాగ్రామ్ ,వాట్సాప్ ల కంపెనీలలోని విలువను చూసి తాను వాటిని కొనుగోలుచేశానని పేర్కొన్నారు. ఇది పోటీని నిర్మూలించడానికి చేసిన ప్రయత్నం కాదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఇప్పటికీ ఇతర సామాజిక మాధ్యమాలతో మెటా గట్టి పోటీని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు.పోటీ లేకుండా చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఇన్ స్టా, వాట్సాప్ ను మెటా కొనుగోలు చేసిందని ఎఫ్‌టీసీ ఆరోపించింది. సామాజిక మాధ్యమరంగంలో ఏకఛత్రాధిపత్యం కోసం ఆ కంపెనీ ప్రయత్నించిందని దుయ్యబట్టింది.
ఈ సందర్భంగా కొన్ని అంతర్గత మెయిల్స్ ను కమిషన్ ప్రస్తావిచింది. అందులో మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చేసిన ఈ మెయిల్ కూడా ఉంది. పోటీ పడడం కంటే వాటినికొనుగోలు చేయడమే ఉత్తమం అనిజుకర్ బర్గ్ ఆ సందేశంలో పేర్కొన్నారని దాన్ని బట్టి వారి వ్యూహం ఏంటో అర్థమవుతుందని కమిషన్ వ్యాఖ్యానించింది.
ఈ విచారణ పై మెటాన్యాయస్థానాన్ని ఆశ్రయించింది.తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టకపోయి ఉంటే..ఆ యాప్స్ నకు ఇంత ఆదరణ వచ్చేది కాదని మెటా న్యాయవాది తమ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. ఒక వేళ ,కోర్టు ఉత్తర్వులు మెటాకు వ్యతిరేకంగా వస్తే..కమిషన్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.ఫలితంగా ఈ టెక్ కంపెనీ ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ ను విక్రయించాల్సి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కంపెనీ ఆదాయంలో 50 శాతం ఇన్ స్టా నుంచి ఆర్జిస్తున్నదేనని తెలుస్తోంది. అయితే మెటా నుంచి వాటిని విడదీయం అంత సులవైన ప్రక్రియ ఏమి కాదని తెలుస్తోంది.
Also Read:Uttara Pradesh: కలిసే ఉంటానని..విడిచిపెట్టానని ప్రమాణం చేశా..అందుకే కలిసే..!
Also Read: Telangana: తెలంగాణ లో భిన్న వాతావరణం.. ఆ జిల్లాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎండలు.. !
mark-zuckerberg | Zucker Berg | meta | instagram | whatsapp | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates