/rtv/media/media_files/2025/01/16/VflNidJIrkjwtCfo92QK.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్ట్ ట్రంప్ తో మెటా తన సంబంధాలు మెరుగుపరుచుకొనే పనిలో పడింది.క్యాపిటల్ భవనం పై దాడి సమయంలో ఆయన ఫేస్‌బుక్, ఇన్ స్టా గ్రామ్ ఖాతా పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ట్రంప్ ఆ సంస్థ పై దావా వేశారు.
సెటిల్‌మెంట్...
తాజాగా 25 మిలియన్ డాలర్లకు ఆ సంస్థ సెటిల్‌మెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు వార్తా పత్రికలు ఈ వివరాలను వెల్లడిస్తున్నాయి.2021 లో క్యాపిటల్ భవనం పై ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విటర్, ఫేసుబుక్ ,యూట్యూబ్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల పై నిషేధం విధించారు. అనంతరం 2023 లో వాటిని పునరుద్దరించారు.
Also Read: UPI Payments: ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ పేమెంట్స్ చేయలేరు!
అయితే అంతకుముందే ఆయన మెటా సంస్థ పై దావా వేశారు. దీన్ని సెటిల్ చేసుకునేందుకు తాజాగా మెటా సిద్ధమైంది. అందులో భాగంగా 25 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. సంస్థలో పలువురు వ్యక్తులు ఓ వార్తా సంస్థతో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక మెటా అందించే సొమ్ములో 22 మిలియన్ డాలర్లు ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి,మిగిలినవి కేసు ఖర్చులకు ఉపయోగిస్తారట.
హష్ మనీ కేసులో న్యూయార్క్ జడ్జి ట్రంప్ నకు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తీర్పు పై తాను అప్పీల్ కు వెళ్తానని ట్రంప్ ఇది వరకే పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కేసును వాదించేందుకు కొత్త లాయర్లను నియమించుకున్నారు.
అధ్యక్షుడు ట్రంప్ ను లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ చట్టాన్ని దుర్వినియోగం చేశారు. ఇది ప్రమాదకరమైనది. న్యూయార్క్ జడ్జి తీర్పు పై మేము అప్పీల్ కు వెళ్తాం. కేసు కొట్టేసే వరకు పోరాడతాం అని కొత్త న్యాయవాది లాయర్ రిబర్ట్ గియుఫ్రా పేర్కొన్నారు.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది..మీదేనేమో చూసుకోండి మరి!