Encounter : కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న దండకారణ్యం
బీజాపూర్ పిడియా అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారని ఛత్తీస్గడ్ సీఎం విష్ణుదేవ్ ప్రకటించారు
బీజాపూర్ పిడియా అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారని ఛత్తీస్గడ్ సీఎం విష్ణుదేవ్ ప్రకటించారు
బీజాపూర్‌లో మళ్ళీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ అనంతరం అధికారులు ఆయుధాలను భారీగా సీజ్ చేశారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
దండకారణ్యంలో అలజడులు ఆగడం లేదు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులను గజగజలాడిస్తున్నారు పోలీసులు. తెలుగు మావోయిస్టులే టార్గెట్‌గా ఆపరేషన్ అబూజ్మడ్ కొనసాగుతోంది.
బీజాపూర్ జిల్లాలో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా పలు విధ్వంసకర సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో రూ. 8 లక్షల రివార్డ్ ఉన్నటువంటి PLGA బెటాలియన్ మెంబర్ అరుణ కడితి కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 29 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. వారిలో తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు శంకర్, లలిత, సుజాత ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.శంకర్ స్వగ్రామం చల్లగరిగె, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా .
మావోయిస్టు సెంట్రల్ రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ఓ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది 50 మంది మావోయిస్టులు మృతి చెందారని వారి మృతికి నిరసనగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ గడ్, ఒడిశా, మహారాష్ట్ర వంటి ఐదు రాష్ట్రాలకు బంద్ కు పిలుపునిచ్చినట్లు ఓ లేఖను విడుదల చేశారు.
తెలంగాణ -ఛత్తీస్ ఘడ్ సరిహద్దు కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌ను ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది.
రెండు రోజులుగా దండకారణ్యం దద్ధరిల్లుతోంది. కాల్పుల మోతతో హోరెత్తుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా 13 మంది చనిపోయారని తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా..మరో ఏడుగురు మావోయిస్టులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పోట్చేరి, సావనార్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.