/rtv/media/media_files/2025/05/22/cN0emn45fwgfpEhf7Yz2.jpg)
maoist sajjala nageswara
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.
ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
పాలిటెక్నిక్ చదివి..
బాపట్ల జిల్లా చీరాల మండలంలోని జాండ్రపేటకు చెందిన ఓ సాధారణ కుటుంబంలో సజ్జా పుట్టాడు. వీరిది చేనేత కుటుంబం. జాండ్రపేటలో స్కూల్ విద్య చదివి గుంటూరులో పాలిటెక్నిక్ చదివారు. అయితే రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో విప్లవోద్యమానికి జీవితకాలం కార్యకర్తగా వెళ్లి నాగేశ్వరరావు అరెస్టు అయ్యారు.
ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?
జైలులో ఉండగా.. సోదరి పెళ్లి కోసం పెరోల్‌పై బయటకు వచ్చి మావోయిస్ట్‌లో ఉన్నారు. గుంటూరు జిల్లా ఉద్యమంలో సజ్జా ఏసన్నగా ముఖ్య పాత్ర పోషించారు. అలాగే నల్లమల, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్‌లో జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించారు. అలాగే పీపుల్స్ వార్ మిలిటరీ పత్రికకి జంగ్ సంపాదకునిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం అవామ్ ఇ జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!\
ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్ ప్రాంతంలో బుధవారం ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా మృతి చెందారు. ప్రస్తుతం సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్‌గా ఉన్న నంబాలపై కోటిన్నర రివార్డు కూడా ఉంది. గణపతి రాజీనామాతో 2018లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇది కూడా చూడండి: Cherry Tomatoes: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!