Karreguttalu : కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..28 మంది నక్సల్స్ మృతి

తెలంగాణ, ఛత్తిస్‌ఘడ్‌ సరిహద్దు కర్రెగుట్టలలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఛత్తీస్‌గఢ్‌ వైపు భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఇందులో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఐదు రోజులుగా ఇక్కడ కూంబింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.

author-image
By Madhukar Vydhyula
New Update
Karreguttalu

Karreguttalu

Karreguttalu : తెలంగాణ, ఛత్తిస్‌ఘడ్‌ సరిహద్దు కర్రెగుట్టలలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఛత్తీస్‌గఢ్‌ వైపు భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఇందులో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఐదు రోజులుగా ఇక్కడ కూంబింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.

Also Read: Air india:పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్‌ ఇండియా!

 ఛత్తీస్గఢ్-,తెలంగాణ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టపై కీలక నేతలతో పాటు వేయి మందికిపైగా మావోయిస్టు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో కర్రెగుట్ట చుట్టూ భద్రతా బలగాల హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. హెలికాప్టర్లతో గుట్టపైన రాకెట్ లాంచర్స్ తో మెరుపుదాడి చేయాలని పోలీస్ బలగాలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు జరిపిన కాల్పుల్లో 28 మంది వరకు నక్సల్స్‌ ప్రాణాలు కొల్పోయినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read:New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

కర్రెగుట్టలలో భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 12 వేల మంది పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి. చుట్టూ 140 కి.మీ. పరిధిలో సాయుధ బలగాల మోహరించారు. కర్రెగుట్టలను జల్లెడ పడుతూ  బలగాలు ముందుకు కదులుతు న్నాయి. దీంతో ఏ క్షణంలోనైనా మరోసారి ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:Pahalgam terror attack: ఏ క్షణమైనా భారత్ -పాక్ యుద్ధం.. వేగంగా మారుతున్న పరిణామాలు?

కర్రె గుట్టలలో గెరిల్లా దళపతి హిడ్మాతో పాటు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం ఉంది. కర్రెగుట్టల చుట్టూ మందుపాతలు పెట్టామని మావోలు ప్రకటించడంతో వాటిని నిర్విర్యం చేసే దిశలో భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు హెలికాప్టర్లు డ్రోన్ల సాయంతో దాడులు చేసేందుకు సిద్ధమయ్యాయి. హెలికాప్టర్లు, డ్రోన్ లతో  పాటు రోప్ ల సాయంతో కర్రెగుట్టలపైకి చేరుకుంటున్నాయి పోలీస్ బలగాలు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ బార్డర్ వైపుకు బలగాల కదులుతున్నాయి. మావోయిస్టు దళాలు పారిపోకుండా కొత్తగూడెం, ములుగు వైపు కేంద్ర, రాష్ట్ర బలగాలు మోహరించాయి. 

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ఈ నరమేధాన్ని ఆపాలి 

భద్రతా బలగాల దాడిని పౌర హక్కుల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం ఈ నరమేధం ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాల్పులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. 
మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చినా కూడా.. ఏకపక్షకాల్పులు జరపడం సరి కాదని అంటున్నారు. కాల్పులు విరమించి శాంతిచర్చలు జలపాలని డిమాండ్ చేశారు.

Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన

Advertisment
Advertisment
తాజా కథనాలు