మళ్ళీ విదేశాలకు మహేష్ బాబు.. సూపర్ స్టార్ స్టైలిష్ లుక్ వైరల్
మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు బయలు దేరాడు. ఈ క్రమంలోనే ఆయన నయా లుక్ బయటికొచ్చింది. ఎయిర్ పోర్ట్ లో లాంగ్ హెయిర్, గడ్డం, రెడ్ క్యాప్, హుడీ వేసుకుని స్టైలిష్‌గా నడిచి వస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
'ఆగడు' ప్లాప్ కు కారణం నేను కాదు.. చేసిందంతా వాళ్లే : శ్రీనువైట్ల
శ్రీను వైట్ల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'ఆగడు' సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సినిమా అంచనాలను అందుకోకపోవడం తన తప్పే అని అన్నారు. నిజానికి సినిమాకు అనుకున్న కథ వేరే. కానీ ఆ కథకు నిర్మాతల నుంచి బడ్జెట్ కుదరకపోవడంతో కథ మార్చాల్సి వచ్చిందని అన్నాడు.
కాంగ్రెస్ లోకి మహేష్ బాబు.. వైరల్ అవుతున్న వీడియో
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహేష్ కలిసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు ఫ్యాన్స్.. 'తరం మారిన.. కాంగ్రెస్ రక్తం మారదు'. అప్పట్లో తండ్రి, ఇప్పుడు తనయుడు.. ఇద్దరూ కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.
Namrata Shirodkar: సీతక్క నేను మీ అభిమానిని..! ఫొటో అడిగిన నమ్రత
మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా ఆయన నివాసంలో కలిసి వరద బాధితుల కోసం రూ. 60 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క కూడా కలిసిన నమ్రత ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. సీతక్కకు తాను అభిమానిని అంటూ చెప్పారు.
Mahesh Babu : మరో బిజినెస్ లోకి మహేష్ బాబు ఎంట్రీ..
మహేష్ బాబు మరో బిజినెస్ లోకి అడుగుపెట్టనున్నాడట. హైదరాబాద్ కు చెందిన 'వెల్నెస్ బ్రాండ్ ఫిట్ డే' అనే స్టార్టప్ కంపెనీలో మహేశ్ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ హెల్త్ సప్లిమెంట్స్ ప్రోటీన్, ప్రోటీన్ బార్ ఉత్పత్తులను అమ్మనుంది.
Mahesh Babu : అప్పటి వరకు నా సినిమాలను డబ్ చేయొద్దు : మహేష్ బాబు
రాజమౌళి ప్రాజెక్ట్‌తోనే హిందీ ఆడియన్స్‌ను పలకరించాలని మహేశ్ బాబు ఫిక్స్ అయ్యారట. అందుకే ‘#SSMB29’ విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది.
Devara Movie : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..?
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. తారక్, కొరటాల శివతో మహేష్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో 'దేవర' కోసం మహేష్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
SSMB 29 Movie : రాజమౌళి బర్త్ డే స్పెషల్.. 'SSMB 29' నుంచి అప్డేట్
రాజమౌళి బర్త్‌డే స్పెషల్ గా అక్టోబర్ 10న 'SSMB29' నుండి అప్డేట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి మూవీ టీమ్ వర్క్ షాప్ లో పాల్గొంటారని తెలుస్తోంది. డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ కానుందట. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.