/rtv/media/media_files/2025/04/22/6kuWNleWYnIxkVlhF3Ak.jpg)
mahesh babu khaleja title controversy
Mahesh Babu Khaleja: సినిమా ఇండస్ట్రీలో టైటిల్స్, స్టోరీల విషయంలో కాపీ రైట్ వివాదాలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఒకరు రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ని మరొకరు వాడుకున్నారని కోర్టును ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా? అయితే అప్పట్లో స్టార్ హీరో మహేష్ బాబు కూడా తన సినిమా టైటిల్ విషయంలో ఇలాంటి చిక్కులను ఎదుర్కొన్నారని మీకు తెలుసా? అవునండి.. 2010 విడుదలైన మహేష్ బాబు 'ఖలేజా' మూవీ టైటిల్ వివాదాన్ని ఎదుర్కొంది.
ఖలేజా టైటిల్ వివాదం..
అయితే ఈ సినిమా టైటిల్ ని ముందుగానే ఓ వ్యక్తి నిర్మాణ మండలిలో రిజిస్టర్ చేయించుకున్నారట. తీరా చిత్రబృందం టైటిల్ ను ప్రకటించి.. విడుదలకు సిద్ధమయ్యే సమయంలో ఆ వ్యక్తి తనతో ఉన్న ఆధారాలతో న్యాయస్థాన్ని ఆశ్రయించారు. సినిమా విడుదలను ఆపేస్తూ 'ఇంజెక్షన్ ' ఆర్డర్ జారీ చేయాలని కోర్టును కోరాడు. దీంతో అతడితో ఉన్న ఆధారాలన్నింటినీ పరిశీలించిన న్యాయమూర్తి ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటికే షూటింగ్ పూర్తయి.. సినిమాకు విడుదలకు సిద్ధంగా ఉండడంతో.. ఆపేయడం సరికాదుని ..చిత్రబృందం నుంచి నష్టపరిహారం కోరడం ద్వారా మీకు న్యాయం జరుగుతుందని అతడికి సూచించారు. దీంతో అతడు మనసు మార్చుకొని నష్టపరిహారం తీసుకోవడానికి సిద్దమయ్యాడు. కోర్టులో వాదోపవాదనలు సమయంలో.. మీరు ఎంత నష్టపరిహారం కోరుకుంటున్నారు అని న్యాయమూర్తి అడగగా.. 10 లక్షలు అని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి తుది తీర్పును భోజనం తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. 10 లక్షలు ఇవ్వడానికి చిత్రబృందం కూడా సరేనని ఒప్పుకుంది.
అత్యాశతో 10 లక్షలు పాయే..
అయితే భోజనం తర్వాత మళ్ళీ కోర్ట్ సెషన్ మొదలవగా.. అతడు మాట మార్చాడు. 10 లక్షలు కాదు 25 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో మళ్ళీ వాదోపవాదనలు జరిగాయి. ముందుగా 10 లక్షలు అని చెప్పి.. ఇప్పుడు మళ్ళీ 25లక్షలు డిమాండ్ చేయడం పై వాదన జరిగింది. దీంతో న్యాయస్థానం .. ఈ పరిస్థితుల్లో ఈ కేసుపై పూర్తి విచారణ చేపట్టలేమని.. తుది నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. పూర్తి ఆధారాలతో మళ్ళీ రండి.. అప్పటి వరకు సినిమా ఆగకుండా కోర్టు ఆపలేదు అని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిటీషనర్ కంగు తిన్నాడు.. అత్యాశతో రావాల్సిన 10 లక్షలు పోయాయి. అటు సినిమా విడుదల కూడా అయ్యింది. ఆ తర్వాత నిర్మాతలు 'మహేష్ ఖలేజా' అంటూ సినిమాను రిలీజ్ చేశారు.
రీసెంట్ గా తమిళ హీరో శివకార్తికేయన్ కూడా ఇలాంటి వివాదాన్ని ఎదుర్కొన్నారు. శివకార్తికేయన్ తన నెక్స్ట్ సినిమా పేరు పరాశక్తి అని అనౌన్స్ చేయగా.. విజయ్ ఆంటోనీ కూడా అదే పేరును తన సినిమాకు పెట్టారు. చివరికి శివకార్తికేయన్ ఆ టైటిల్ ని ఉపయోగించుకునేందుకు కోర్టు తీర్పునిచ్చింది.
telugu-news | cinema-news