/rtv/media/media_files/2025/04/27/JEUWsFtlgolXWT6chz8h.jpg)
Mahesh Babu ED
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - సాయి సూర్య డెవలపర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ద్వారా నోటీసులు అందుకున్న మహేష్.. ఇవాళ విచారణకు హాజరు అవుతాడని నెట్టింట ప్రచారం జోరుగా సాగింది. పలు మీడియా కథనాలు సైతం ఇవాళ మహేష్ బాబు ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు అని వార్తల్లో పేర్కొన్నాయి. ఇప్పుడు ఇదే కేసులో కీలక అప్డేట్ వచ్చింది.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
మహేష్ బాబుకు పంపించిన నోటీసుల్లో ఏప్రిల్ 28న ఈడీ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ నోటీసులపై మహేష్ బాబు తాజాగా స్పందించారు. ఈ మేరకు ఈడీ అధికారులకు ఒక లేఖ రాశారు. షూటింగ్ కారణంగా రేపు (ఏప్రిల్ 28)న విచారణకు హాజరుకాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో విచారణకు మరో తేదీ ఇవ్వాలని మహేష్‌బాబు ఈడీని కోరారు. దీంతో మహేష్ బాబు రిక్వెస్ట్‌పై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
కేసు ఏంటంటే?
నటుడు మహేష్ బాబుకు ఇటీవలు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 28న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లుగా ఈడీ గుర్తించింది.
Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు
రూ.5.9 కోట్లు పారితోషికం..
ఈ మేరకు ఈ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం ఏప్రిల్ 27న నటుడు మహేష్ బాబుకు సమన్లు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ప్రచారం కోసం మహేష్ బాబు ఆమోదం తెలిపారని ఆరోపణలు ఉన్నాయి. సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు ఆయన రూ.5.9 కోట్లు అందుకున్నారని ED వర్గాలు తెలిపాయి. ఇందులో రూ.3.4 కోట్లు చెక్కు ద్వారా, 2.5 కోట్లు నగదు ద్వారా చెల్లించారు. మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించిన లాండరింగ్ డబ్బులో భాగంగా ఈ నగదు భాగం ఉందని ED అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె. సతీష్ చంద్ర గుప్తా, ఇతరులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ED తన మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. అనధికార లేఅవుట్‌లలో ప్లాట్‌లను అందించడం, ఒకే ప్లాట్‌లను రెండు, మూడుసార్లు అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం ద్వారా కొనుగోలుదారుల నుంచి ఈ సంస్థలు ముందస్తుగా కోట్లు వసూలు చేశాయని ఆరోపణలున్నాయి.
ఈ వెంచర్ వెనుక ఉన్న మోసపూరిత పద్ధతుల గురించి తెలియక చాలా మంది పెట్టుబడి పెట్టేలా మహేష్ ప్రభావితం చేశారు. ఈ కుంభకోణం కార్యాచరణ అంశాలలో మహేష్ ప్రమేయం ఉండకపోవచ్చు, కానీ డెవలపర్ల నుంచి అతను అందుకున్న డబ్బును ED పరిశీలిస్తోంది. ఏప్రిల్ 16న జరిగిన సోదాల్లో, సురానా గ్రూప్ అధిపతి నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ ప్రాంగణాల నుంచి పలు పత్రాలు, నగదు సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ED పేర్కొంది. ఈ పత్రాలు పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలను సూచిస్తున్నాయని, వీటిలో రూ. 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని ED తెలిపింది.
mahesh babu | Sai Surya Developers Case | latest-telugu-news | telugu-news