Bandi Saroj Kumar: మహేష్ బాబుతో శవాల ముందు డ్యాన్స్ వేయిస్తా..!

మహేష్ బాబుతో సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వస్తే మహేష్ పాత్రతో శవాల ముందు డ్యాన్స్ వేయిస్తా అంటూ యంగ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మహేష్ టాలెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి అని అభిప్రాయపడ్డారు.

New Update
Bandi Saroj Kumar

Mahesh Babu Dance

Bandi Saroj Kumar: టాలీవుడ్‌లో ఏ డైరెక్టర్‌కైనా ఒక కల – మహేష్ బాబు(Mahesh Babu)తో ఓ సినిమా చేయడం. అలాంటి ఛాన్స్ వస్తే అతన్ని పూర్తిగా విభిన్నంగా ప్రజెంట్ చేస్తానని అంటున్నారు యంగ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్. "రొటీన్ కథలతో కాదు, మహేష్ బాబుని శవాల ముందు డ్యాన్స్ చేసే క్యారెక్టర్‌లో చూపిస్తా. ఆయన టాలెంట్‌ను పూర్తిగా బయటకు తేవాలంటే మనం కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి" అని వ్యాఖ్యానించారు.

ఇంతటి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడమే కాదు, మహేష్ బాబు ఇప్పటివరకు చేసిన పాత్రలు ఒకేలా ఉన్నాయని, మహేష్ సినిమాలన్నీ ఒకేలాంటి పాత్రలతో పరమ బోరింగ్ గా మారాయని కూడా ధైర్యంగా చెప్పారు. ప్రస్తుతం మహేష్‌కు సరైన స్క్రిప్ట్‌లు రావడం లేదంటూ విమర్శించారు డైరెక్టర్ బండి సరోజ్ కుమార్. 

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

ఎవరీ బండి సరోజ్ కుమార్‌..?

బండి సరోజ్ కుమార్‌ పేరు యూట్యూబ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 'నిర్బంధం', 'మాంగల్యం' వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలతో యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆయన, నటుడు, దర్శకుడిగా తనదైన మార్క్ గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో, టాప్ హీరోలను డైరెక్ట్ చేయాలని ఉంటే ఎవరిని, ఎలా చేయాలనుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానంగా మహేష్ గురించి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.

Also Read: ‘సోదరా’ ట్రైలర్‌ చూశారా..? సంపూ రచ్చ మాములుగా లేదుగా!

ఇక మహేష్ బాబు మాత్రం ప్రస్తుతం ఒక మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్‌తో భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో షెడ్యూల్ పూర్తి చేశారు. షూటింగ్ స్పాట్‌లో మహేష్, రాజమౌళి, ప్రియాంకలను చూసిన ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరై ఫొటోలు దిగడం, ఆటోగ్రాఫ్లు తీసుకోవడం విశేషం. అటు వారితో దిగిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఒకవైపు యువ దర్శకుల కలలు, మరోవైపు స్టార్ హీరోల భారీ ప్రాజెక్టులు – టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరి భవిష్యత్తులో బండి సరోజ్ కుమార్‌కు మహేష్‌తో పని చేసే అవకాశం వస్తుందా..? వేచి చూడాలి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు