BIG BREAKING: నేడే ఈడీ విచారణకు మహేశ్ బాబు

సాయి సూర్య, సురానా ప్రాజెక్ట్ కేసులో ఈడీ నేడు ప్రిన్స్ మహేశ్ బాబును విచారించనుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కంపెనీలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రజలను ప్రభావితం చేశారు. ఈ ఆరోపణలపై ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

New Update
Mahesh Babu ED

Mahesh Babu ED

సాయి సూర్య, సురానా ప్రాజెక్ట్ కేసులో ఈడీ నేడు ప్రిన్స్ మహేశ్ బాబును విచారించనుంది. మహేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కంపెనీలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రజలను ప్రభావితం చేశారని అతనిపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు విచారణకు హాజరు కావాలని ఈడీ తెలిపింది. అయితే మహేశ్ గత నెల 28వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. షూటింగ్ కారణంగా హాజరు కాలేకపోయినట్లు మహేశ్ తెలిపినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:  AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని..

సురానా  గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్  కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను  మహేశ్‌ బాబు చెక్కు రూపంలో రూ.3.4 కోట్లు, లిక్విడ్ క్యాష్ రూ.2.5 కోట్లు అంటే మొత్తం రూ.5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలను ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

  ప్రమోషన్స్ పేరుతో వారి నుంచి భారీగా పారితోషికం తీసుకున్నారనే అభియోగాల మేరకు గత నెల 22న మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయి.ఇదిలా ఉండగా ఏప్రిల్ 28వ తేదీన మహేశ్‌ను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. కానీ షూటింగ్ కారణంగా మషేశ్ ఈడీ విచారణకు హాజరు కాలేదు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు