/rtv/media/media_files/2025/04/19/PpZHTTc0ZQMV571kcp2A.jpg)
Athidi Re Release
Athidi Re Release: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా SSMB29తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో మహేష్ పూర్తిగా కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో, మహేష్ ఫ్యాన్స్‌కి మరో స్పెషల్ ట్రీట్ సిద్ధమైంది.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా
సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి (మే 31) సందర్భంగా, మహేష్ బాబు నటించిన ‘అతిథి’ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అమృతా రావు హీరోయిన్‌గా నటించింది.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో యావరేజ్ గా నిలిచింది. కానీ, ఇప్పుడు మహేష్ బాబు క్రేజ్ కలిసొచ్చే అవకాశం ఉండటంతో, రీ-రిలీజ్‌పై ఫ్యాన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
మహేష్ అభిమానులు తమ హీరోను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడాలనే ఉత్సాహంలో ఉన్నారు. మరి 'అతిధి' రీ-రిలీజ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి!
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?