Mahesh Babu ED Notice : ఈడీ విచారణకు మహేశ్ బాబు డుమ్మా ? ఈడీ రియాక్షన్‌పై ఉత్కంఠ...

టాలీవుడ్ అగ్ర హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ ఇచ్చిన సమయం ముగిసినప్పటికీ ఆయన విచారణకు హజరుకాలేదు. దీంతో ఇవాళ మహేశ్ బాబు విచారణకు హాజరవుతారా..లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. 

New Update
Mahesh Babu ED Notice

Mahesh Babu ED Notice

Mahesh Babu ED Notice  : టాలీవుడ్ అగ్ర హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది.  నోటీసుల ప్రకారం ఈరోజు ఆయన బషీర్‌బాగ్‌ లోని ఈడీ కార్యాలయానికి ఉదయం 10.30కి విచారణకు హాజరు కావలసి ఉంది. ఈడీ ఇచ్చిన సమయం ముగిసినప్పటికీ ఇంతవరకు ఆయన విచారణకు హజరుకాలేదు. దీంతో ఇవాళ మహేశ్ బాబు విచారణకు హాజరవుతారా.. లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

కాగా, సురానా  గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్  కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను  మహేశ్‌ బాబు చెక్కు రూపంలో రూ.3.4 కోట్లు, లిక్విడ్ క్యాష్ రూ.2.5 కోట్లు అంటే మొత్తం రూ.5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలను ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారని, ప్రమోషన్స్ పేరుతో వారి నుంచి భారీగా పారితోషికం తీసుకున్నారనే అభియోగాల మేరకు ఈ నెల 22న మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయి.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!


 27న విచారణకు రావాలని.. 

సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న మహేశ్ బాబును ఏప్రిల్ 27న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కావాల్సిన సమాచారం ఇచ్చేందుకు రావాలని సూచించింది. అయితే ఆయన నోటీసులకు స్పందించకపోవడంతో పాటు విచారణకు కూడా ఇంతవరకు హాజరు కాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. అయితే ఈడీ విచారణపై తన న్యాయవాదులను మహేశ్‌బాబు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం వరకు ఆయన లాయర్లు ఈడీ అధికారులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఆయన విచారణకు హాజరుకాలేకపోయారని తదిపరి విచారణకు హజరవుతారని లాయర్లు ఈడీ నుంచి అనుమతి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

మరోవైపు మనీ లాండరింగ్‌కు పాల్పడిన కంపెనీల విషయంలో మహేశ్‌బాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు కంపెనీలు తనతో పాటు ప్రజలను మోసం చేశాయని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు ప్రచారం సాగుతోంది. అవసరమైతే వారు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి తనకు ఆ సంస్థకు ఎలాంటి లావాదేవీలు లేవని అగ్రిమెంట్‌ను రద్ధు చేసుకోవడానికి మహేశ్‌బాబు సిద్ధమయ్యారనే వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ తీసుకునే తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read:BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు