Mahesh Babu: పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫోటో.. ఇదెక్కడి అభిమానం రా సామీ!

కర్నూలు జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే యువకుడు హీరో మహేశ్ బాబుపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫొటో ప్రింట్ చేయించాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ఆ వెడ్డింగ్ కార్డును షేర్ చేస్తున్నారు.

New Update
Mahesh Babu wedding card

Mahesh Babu wedding card

ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్లపై ఫ్యాన్స్ చూపించే ప్రేమ, అభిమానాలకు అంతుపట్టకుండా పోతుంది. అభిమానం పేరుతో ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమ అభిమాన హీరో, హీరోయిన్ సినిమా రిలీజ్ అవుతుందంటే.. థియేటర్ల వద్ద టపాసులు, బ్యానర్లతో హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. 

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

అంతేకాకుండా అభిమానం చాటుకునేందుకు బర్త్ డే రోజున రక్తదానాలు చేయడం, అనాథాశ్రమాల్లో బట్టలు, పండ్లు పంపిణీ చేయడం వంటివి చేస్తున్నారు. మరికొందరు అభిమాన హీరో పేరు లేదా ఫొటోను పచ్చబొట్టుగా పొడిపించుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా గుడి కట్టి పూజలు చేస్తున్నారు. 

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

తాజాగా అలాంటిదే మరొక సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తాను ఎంతగానో అభిమానించే హీరో ఫొటోను పెళ్లికార్డుపై ప్రింట్ చేయించాడు. ఏకంగా దేవుళ్ల ఫొటోల పక్కన ఆ హీరో ఫొటో ప్రింట్ చేయడంతో అదికాస్త వైరల్‌గా మారింది. దీంతో ఫ్యాన్స్ ఆ పెళ్లి కార్డును తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది అనే విషయానికొస్తే.. 

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

ఫ్యాన్ వీరాభిమానం

Also Read: ఇంటి దొంగలే దేశ ద్రోహులు.. ఉగ్రవాదులకు 15 మంది కశ్మీరీలు సహాయం!

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగింది. సాయి చరణ్ అనే యువకుడు మహేశ్ బాబుకు వీరాభిమాని. ఆ అభిమానంతోనే అతడు మహేశ్ బాబు ఫ్యాన్ క్లబ్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. మహేశ్ సినిమా రిలీజ్ అవుతున్నా లేదా బర్త్ డే, మరేదైన వేడుక ఉన్నా తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అతడికి పెళ్లి కుదిరింది. దీంతో తన పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫొటో ప్రింట్ చేయించి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పెళ్లి కార్డు వైరల్‌గా మారింది. 

mahesh babu | latest-telugu-news | telugu-news | viral-news

Advertisment
తాజా కథనాలు