ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న బిడ్డని అడవిలో పడేసిన టీచర్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగంపై ఉన్న ఆశ ఓ తండ్రిని అత్యంత క్రూరంగా మార్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన నాలుగో బిడ్డకు జన్మనివ్వడంతో, ఉద్యోగ నిబంధనలకు భయపడి ఆ పసికందును తీసుకెళ్లి దట్టమైన అడవిలో వదిలివెళ్లాడు.