/rtv/media/media_files/2025/10/05/coldrif-cough-syrup-2025-10-05-21-32-00.jpg)
Cough Syrup
Cough Syrup Tragedy: పిల్లల్లో దగ్గును తగ్గించాల్సిన దగ్గుమందు ఏకంగా ప్రాణాలు తీసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే ‘కోల్డ్‌రిఫ్’ అనే దగ్గు మందు మూలంగా మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా పసివారి మరణాలకు కారణమైన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మా అనుమతులు రద్దు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు(సోమవారం) ప్రకటించింది. అదే సమయంలో కంపెనీ మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ఔషధ తయారీ సంస్థల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది.
కాగా, పసివారి మరణాలకు కారణమైన ఈ దగ్గు మందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారుచేసింది. పసివారి మరణాల నేపథ్యంలో ఈ కంపెనీలో తనిఖీలు చేయగా.. సిరప్‌లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సిరఫ్ తయారీలో సరైన తయారీ పద్ధతులు అవలంబించడం లేదని తేలింది. అలాగే 300కు పైగా ఉల్లంఘనలను రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే కంపెనీ యజమాని జి.రంగనాథన్‌ను అరెస్టు చేసింది. అలాగే ఈరోజు ఉదయం ఫార్మా సంస్థకు చెందిన పలు ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది.
దగ్గుమందు మరణాలకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) పేర్కొన్నది. ఈ విషయాన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ నిబంధనలను విస్మరించిందని, కేంద్రం చేసిన సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మీడియా కథనాలుపేర్కొన్నాయి. దగ్గుమందు తయారీ విషయంలో సరైన పర్యవేక్షణ చేయ లేదని, సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో విషపూరితమైన సిరప్ మార్కెట్లోకి ప్రవేశించిందని, (Poisonous Syrup) ఆ నిర్లక్ష్యం కారణంగా పిల్లల మరణాలకు దారితీసిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ముల్లంగి ఆకులు పడేస్తున్నారా..? అయితే ఈ బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాల్సిందే!!