Mid Day Meals: విద్యార్థులకు పేపర్లో మధ్యాహ్న భోజనం.. స్పందించిన రాహుల్ గాంధీ

మధ్యప్రదేశ్‌లో కొందరు చిన్నారులకు న్యూస్‌పేపర్‌లో మధ్యాహ్నం భోజనం వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో స్పందించారు. ఈ వీడియోను పోస్టు చేసి.. తన హృదయం ముక్కలైందని రాసుకొచ్చారు.

New Update
Rahul Gandhi Responds on kids having mid-day meals on newspapers in Madhya Pradesh

Rahul Gandhi Responds on kids having mid-day meals on newspapers in Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లో కొందరు చిన్నారులకు న్యూస్‌పేపర్‌లో మధ్యాహ్నం భోజనం వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్యోపుర్‌ జిల్లాలోని ఓ స్కూల్‌లో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో స్పందించారు. ఈ వీడియోను పోస్టు చేసి.. తన హృదయం ముక్కలైందని రాసుకొచ్చారు. ఇలాంటి దయనీయ పరిస్థితిపై అధికార నేతలు సిగ్గుపడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: బీహార్ ఎన్నికల్లో కలకలం.. రోడ్లపై VVPAT స్లిప్స్‌.. VIDEO

పిల్లలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని.. వాళ్లకి మాత్రం కనీస గౌరవం దక్కడం లేదని విమర్శించారు. అక్కడ అభివృద్ధి అనేది అంతా ఓ భ్రమా అంటూ విరుచుకుపడ్డారు. వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని అధికారంలోకి వస్తున్నారని.. ఇలాంటి దయానీయమైన స్థితిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న అధికార నేతల సిగ్గుపడాలంటూ'' రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read: ఇజ్రాయిల్, ఇండియా కలిసి పాక్‌పై దాడికి ప్లాన్.. ఇందిరాగాంధీ ఎంట్రీతో సీన్ రివర్స్

మరోవైపు ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. నెటిజన్లు కూడా అక్కడి అధికారులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మధ్నాహ్య భోజనం అనేది పిల్లల హక్కని.. కానీ వాళ్లకు ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారం వడ్డిస్తున్నారంటూ మండిపడుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు