Old woman fights with a fox : చీరకొంగునే ఆయుధంగా మలిచి...నక్కతో 65 ఏళ్ల వృద్దురాలు బిగ్‌ ఫైట్‌

ఒంటరిగా ఉన్న సమయంలో ఏదైనా అలికిడి అయితేనే భయంతో సగం చస్తాము. అలాంటిది ఓ నక్క తనపై దాడి చేస్తే..ఎదురు దాడి చేయడమే కాకుండా తన చీరకొంగునే నక్కకు ఉరితాడుగా మలిచి దాని ప్రాణం తీసి తన ప్రాణాలను దక్కించుకుంది. ఆమె 65 సంవత్సరాల వృద్దురాలు కావడం విశేషం.

New Update
Old woman fights with a fox

Old woman fights with a fox

 Old woman fights with a fox : ఒంటరిగా ఉన్న సమయంలో ఏదైనా అలికిడి అయితేనే భయంతో సగం చస్తాము. అలాంటిది ఓ నక్క తనపై దాడి చేస్తే..ఎదురు దాడి చేయడమే కాకుండా తన చీరకొంగునే నక్కకు ఉరితాడుగా మలిచి దాని ప్రాణం తీసి తన ప్రాణాలను దక్కించుకుంది. అలాఅని ఆమె యుక్తవయస్కురాలు కాదు. 65 ఏళ్ల వృద్దురాలు.నక్క దాడిలో ఆ వృద్దురాలికి 18 గాట్లు పడ్డప్పటికీ ఆమె వదలలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ర్టంలోని శివ్‌పురి జిల్లా బర్ఖాడీ గ్రామంలో చోటు చేసుకుంది.  

మధ్యప్రదేశ్‌లోని బదర్వాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్ఖాడి గ్రామానికి చెందిన సురాజియా అనే  65 ఏళ్ల వృద్దురాలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మేత కోయడానికి తన పొలానికి వెళ్ళింది. ఒక కల్వర్టు దగ్గర గడ్డి కట్టను ఎత్తడానికి ఆమె వంగగానక్క అరిచిన శబ్దం వినిపించింది, అక్కడే మాటువేసిన ఒక నక్క ఆమెపైకి దూసుకొచ్చింది.  ఆమె తిరిగి స్పందించేలోగా అది దాడి చేసింది. దీంతో ఆమె నేలపై పడ్డారు. దీంతో తొలుత కాళ్లపై ఆ నక్క కరిచింది. సురజియా గట్టిగా కేకలు వేసినా సమీపంలో ఎవరూ లేకపోవడంతో సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.ఒక్కసారిగా దాడి చేసి ఆమె చేతులు, కాళ్ళను కొరికింది. మరొకరైతే భయంతో పరుగు తీసేవారు. కానీ, సురజియా భాయి మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఆ నక్కతో వీరోచితంగా పోరాడారు. ఒంటరిగా ఉండి రక్తస్రావం అవుతున్నప్పటికీ, ఆమె జంతువు దవడలను పట్టుకుని పట్టుకోవడానికి ప్రయత్నించింది, అది ఆమెను కొరుకుతూనే ఉంది. 30 నిమిషాలపాటు తన శక్తినంతా కూడగట్టుకుని నక్క ఆట కట్టించారు. తన చీర కొంగుతోనే దాని మెడకు ఉచ్చు బిగించి చంపేశారు. నక్క మెడ చుట్టూ కొంగును చుట్టి, జంతువు కదలకుండా దాని ఊపిరి ఆగిపోయే వరకు దానిని గట్టిగా పట్టుకుంది. అలసిపోయి, ఆమె దాని పక్కన స్పృహ కోల్పోయింది.  6 గంటల తర్వాత ఆసుపత్రిలో ఆమె స్పృహలోకి వచ్చారు. 

కొన్ని గంటల తర్వాత గ్రామస్తులు ఆమెను పొలంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి, బదర్వాస్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు, అక్కడి నుండి ఆమెను శివపురి జిల్లా ఆసుపత్రికి తరలించారు. "అర్ధరాత్రి దాటాక ఆమె కళ్ళు తెరిచే వరకు మేము భయపడ్డాము" అని ఒక బంధువు చెప్పారు.  "నేను చనిపోతానని అనుకున్నాను" అని ఆమె ఆసుపత్రి మంచం మీద నుండి చెప్పింది. "నేను నక్కపై ఎదురుదాడికి దిగాను. తాను అరిచేసరికి నక్క మరింతగా ఉగ్రరూపం చూపించిందని, చేతులపైనా కరవడం ప్రారంభించిందని భయానక ఘటనను సురజియా గుర్తు చేసుకున్నారు. దీంతో విధిలేక చంపేశానని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సూరాజియాకు 18 లోతైన గాయాలు ఉన్నాయని, కానీ ఆమె తల, మెడ లేదా ఉదరంపై ఎటువంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు.  "ఆమె ఆరోగ్యం  స్థిరంగా ఉంది, యాంటీ-రేబిస్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు ఒక వారంలో కోలుకుంటారు" అని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అయితే గతంలోనూ సురజియా కుటుంబంపై నక్కలు దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. 6 నెలల కిందట ఆమె మరిది లాతురా జాదవ్‌.. ఇంట్లో ఉండగా నక్క ఇంట్లోకి దూరింది. దీంతో పిల్లలను కాపాడే క్రమంలో ఆయన దానితో పోరాడి చంపేశారు. ఆ సమయంలో ఆయన ఒంటి నిండా నక్క కరిచిన గాయాలయ్యాయి. అయితే దురదృష్టవశాత్తూ ఆ గాయాల నుంచి కోలుకోలేక 3 నెలల కిందట ఆయన చనిపోయారు.      

ఇది కూడా చదవండి:ఏపీలో దారుణం.. భార్యను రోకలి బండతో హత్య చేసి గొంతు కోసుకున్న భర్త

Advertisment
తాజా కథనాలు