Crime : పట్టపగలు నడిరోడ్డుపై దారుణం...భార్యను కాల్చి చంపి...

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పట్టపగలు దారుణహత్య జరిగింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను భర్త అత్యంత దారుణంగా నడిరోడ్డుపై కాల్చి చంపాడు. స్థానిక రూప్‌సింగ్‌ స్టేడియం సమీపంలో అరవింద్‌ అనే కాంట్రాక్టరు భార్య నందినిని తుపాకితో కాల్చి చంపడం కలకలం రేపింది.

New Update
Husband shot and killed his wife

Husband shot and killed his wife

Crime : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పట్టపగలు దారుణహత్య జరిగింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను భర్త అత్యంత దారుణంగా నడిరోడ్డుపై కాల్చి చంపాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక రూప్‌సింగ్‌ స్టేడియం సమీపంలో అరవింద్‌ అనే కాంట్రాక్టరు తనతో సహజీవనం చేసిన నందిని (28)ని తుపాకితో కాల్చి చంపడం కలకలం రేపింది. అయితే అరవింద్‌, నందిని గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ క్రమంలో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే  అరవింద్‌ గతం గురించి తెలిసిన నందిని అతనికి  దూరంగా ఉంటోంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న అరవింద్  ఆమె కోసం దారిలో వేయిట్‌ చేసి తుపాకీతో విచక్షణా రహితంగా కాల్చి చంపాడు. అరవింద్ పరిహార్ .. తన భార్య నందినిని అడ్డగించి ఒక తుపాకీతో ఆమెపై నాలుగైదు రౌండ్ల కాల్పులు జరపడంతో  తీవ్ర గాయాలతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది.. అనంతరం అరవింద్ పరిహార్ ఆ పక్కనే కూర్చున్నాడు. స్థానికులు అతని చేతిలో ఉన్న తుపాకీని చూసి భయపడి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేక చూస్తుండిపోయారు. ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని అరవింద్ పై టియర్ గ్యాస్ ప్రయోగించి పట్టుకున్నారు. నందినిని జేఏహెచ్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్పీ యాదవ్ తెలిపారు.

ఇది కూడా చూడండి:ఇదేం ట్రాఫిక్ రా బాబు.. హైటెక్ సిటీ ఏరియాలో వాహనాలు ఎలా ఆగాయో చూడండి-

అయితే అరవింద్‌తో సహజీవనం చేస్తుందని కొందరు, వారు భార్యభర్తలు కొంతమంది చెబుతున్నారు. కాగా.. అరవింద్, నందినిలది ప్రేమ వివాహం అని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అరవింద్ కు పెళ్లై పిల్లలున్నారన్న విషయాన్ని తనకు చెప్పకుండా మోసం చేశాడంటూ నందిని సెప్టెంబర్ 9న ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో అరవింద్‌తో తన ప్రాణాలకు ముప్పు ఉందని నందిని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  హత్య జరిగిన రోజు కూడా ఆమె తన ఫిర్యాదుతో ఎస్పీ కార్యాలయానికి వెళుతుండగా అరవింద్‌ అడ్డుకొని కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గతేడాది నవంబర్ లో అతను, అతని ఫ్రెండ్ పూజా పరిహార్ తనపై దాడి చేశారని కూడా కంప్లైంట్ చేసింది. కాగా.. నందినికి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మూడవ భర్త హత్యకేసులో 2022లో జైలు నుంచి విడుదలై బయటికి వచ్చినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ !

Advertisment
తాజా కథనాలు