/rtv/media/media_files/2025/10/25/girls-in-school-uniform-try-to-buy-alcohol-2025-10-25-21-27-15.jpg)
Girls In School Uniform Try To Buy Alcohol
మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు లిక్కర్ షాపుకెళ్లి మద్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నైన్‌పూర్‌లో ఉన్న వైన్ షాపుకు స్కూల్ డ్రెస్‌లో ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అక్కడ మద్యాన్ని కొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read: త్రిశూల్ విన్యాసాలకు సిద్ధమైన త్రివిధ దళాలు.. పాక్ కీలక నిర్ణయం
ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ సంఘటనపై వాళ్లు ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బాలికలకు లిక్కర్ అమ్మడంపై మద్యం షాపు యజమానిని విచారిస్తున్నారు. ఆ అమ్మాయిలు వాళ్లకి వాళ్లే అక్కడికి వచ్చారా ? లేదా ఎవరైనా పంపించారా ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: అమెరికా చేతిలోకి పాకిస్థాన్ అణుబాంబులు.. సంచలన నిజం బయటపెట్టిన మాజీ CIA అధికారి
भाजपा सरकार की शराब की दुकान अब स्कूली छात्राओं तक पहुंच गई है... नियमानुसार नाबालिगों को शराब नहीं बेची जा सकती है लेकिन शराब प्रेमी सरकार यह भी कर गुजरना चाहती है। pic.twitter.com/9yOStqNOvW
— Ravindra Sahu Jhoomarwala (@RavindraSahuINC) October 25, 2025
Follow Us