Pragya Singh Thakur: మీ కూతుర్లు హిందూయేతరులతో వెళ్తే కాళ్లు విరగ్గొట్టండి..  ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు

ఆడపిల్లల విషయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మీ బిడ్డ మీ మాట వినకుండా ఇతర మతస్తుల ఇళ్లలోకి వెళ్తే.. వారి కాళ్లను విరగ్గొట్టండి అంటూ పిలుపునిచ్చింది.

New Update
Pragya Singh Thakur

Pragya Singh Thakur

Pragya Singh Thakur: ఆడపిల్లల విషయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఇటీవల విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.. 'లవ్ జిహాద్' పేరుతో జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో హిందూ బాలికల తల్లిదండ్రులకు  ఆమె కీలక సూచనలు చేశారు. "ఒకవేళ మీ కుమార్తె మీ మాట వినకుండా ఇతర మతస్తుల ఇళ్లలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే.. వారి కాళ్లను విరగ్గొట్టి, ఇంట్లో నుంచి బయటకు పోకుండా కాపాడుకోండి. అప్పుడే మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది" అని ఆమె బహిరంగంగా చేసిన ప్రకటన తీవ్రంగా కలకలం సృష్టిస్తోంది.ఆమె వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. 'లవ్ జిహాద్' పేరుతో జరుగుతున్న ఆరోపణల నుంచి హిందూ బాలికలు, యువతులను రక్షించుకోవాలని తల్లిదండ్రులకు సంచలన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో అలజడి రేపుతున్నాయి.

హిందూ మతానికి చెందిన యువతులు ఇతర మతాల యువకులను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకోవాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఠాకూర్ సూచించారు. "ఒకవేళ మీ కుమార్తె మీ మాట వినకుండా, ఇతర మతస్తుల ఇళ్లలోకి వెళ్లడానికి, వారిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, వారి కాళ్లను విరగ్గొట్టి, ఇంట్లో నుంచి బయటకు పోకుండా కాపాడుకోవాలి. అప్పుడే మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది" అని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. 

కూతురు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆమెను లక్ష్మీ, సరస్వతి రూపంగా భావించి సంబుర పడుతారు.  అలాంటి కూతురు పెరిగి పెద్దయ్యాక మరో మతస్తుడికి భార్య కావడానికి ఎలా సిద్ధపడుతుందని ఆమె ప్రశ్నించారు. అటువంటి పరిస్థితుల్లో ఆ బాలికలను ఆపడం తల్లిదండ్రుల బాధ్యత అని గుర్తు చేశారు. ఇతర మతాల యువకులతో తమ ఇష్టానుసారం పెళ్లి చేసుకునే అమ్మాయిలను తల్లిదండ్రులు కచ్చితంగా నియంత్రించాలని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సీరియస్‌గా కోరారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు సరైన విలువలు, సంస్కారాలు నేర్పించాలని ప్రజ్ఞా ఠాకూర్ సూచించారు. అయినప్పటికీ వారు దారి తప్పితే మాట వినకపోతే వారిని దారిలో పెట్టేందుకు కొట్టాల్సి వచ్చినా వెనక్కి తగ్గవద్దని, అలాంటి అమ్మాయిలకు తగిన గుణపాఠం చెప్పడం సమాజానికి, కుటుంబానికి చాలా మంచిదని ఆమె ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు బాలికల పట్ల తల్లిదండ్రులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పలు వర్గాలు మండిపడుతున్నాయి.


ఆడబిడ్డపై హింసను ప్రోత్సహించడం ఏంటి?


కాగా, ప్రగ్యా వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుమార్తె పుట్టినప్పుడు లక్ష్మీ రూపంలో ఇంటికి వచ్చినట్లు ఆనందించే తల్లిదండ్రులు, ఆమె పెరిగిన తర్వాత ఇతర మతస్తులను పెళ్లాడితే ఆ ఆనందం ఎక్కడికి పోతుందని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు హింసను ప్రోత్సహిస్తున్నాయని, స్త్రీల స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని విమర్శకులు మండిపడుతున్నారు. అయితే, మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ దేశంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని కాంగ్రెస్ ప్రతినిధి భూపేంద్ర గుప్తా ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కేవలం ఏడు మత మార్పిడుల కేసుల్లోనే శిక్ష పడితే, ఇంత గోల, విద్వేషం ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు? అంటూ ఆయన  ప్రశ్నించారు. దేశంలోని ప్రజలను మత ప్రాతిపాదికన బీజేపీ విభజిస్తుంది అని విమర్శించారు.

Also Read: నిరసనకారులపై బురద చల్లిన ట్రంప్.. AIతో అమెరికా అధ్యక్షుడి వింత శేష్టలు

Advertisment
తాజా కథనాలు