Watch Video: రైల్వేస్టేషన్‌లో పనిచేయని ఫోన్ పే.. ప్యాసింజర్‌ను కొట్టిన సమోసా వ్యాపారి

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫోన్‌ పే పనిచేయకపోవడంతో ఓ ప్రయాణికుడిపై సమోసా విక్రేత దాడి చేయడం కలకలం రేపింది. శుక్రవారం ఈ ఘటన జరగగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Madhya Pradesh Police Filed A Case On Samosa Vendor Who Attacked On Passanger

Madhya Pradesh Police Filed A Case On Samosa Vendor Who Attacked On Passanger

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫోన్‌ పే పనిచేయకపోవడంతో ఓ ప్రయాణికుడిపై సమోసా విక్రేత దాడి చేయడం కలకలం రేపింది. శుక్రవారం ఈ ఘటన జరగగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఆ జబల్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఓ ప్రయాణికుడు సమోసా కొనుక్కున్నాడు. 

Also Read: మీ కూతుర్లు హిందూయేతరులతో వెళ్తే కాళ్లు విరగ్గొట్టండి..  ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు

ఆ తర్వాత ఫోన్‌ పే లో డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తుండగా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది. అదే సమయంలో అతడు వెళ్లాల్సిన రైలు బయలుదేరింది. దీంతో ఆ ప్యాసింజర్‌ సమోసాను తిరిగి ఇచ్చేశాడు. ఫోన్ పే అవ్వట్లేదని చెప్పాడు. సమోసా అక్కడే వదిలేసి రైలు ఎక్కేందుకు యత్నించాడు. కానీ సమోసా విక్రేత మాత్రం కోపంతో ప్రయాణికుడిపై దాడి చేశాడు. అతడి కాలర్‌ పట్టుకొని లాక్కెల్లాడు. డబ్బులు ఇవ్వాలంటూ పట్టుబట్టాడు.  

Also Read: పండగ పూట విషాదం.. కూతురితో అలా చేశాడని యువకుడిని దారుణంగా చంపిన తండ్రి!

చివరికి ఆ ప్రయాణికుడు తన దగ్గర ఉన్న స్మార్ట్‌వాచ్‌ను ఆ సమోసా విక్రేతకు ఇచ్చాడు. దీంతో ఆ విక్రేత ప్రయాణికుడికి రెండు సమోసాలు ఇచ్చి.. రైలు ఎక్కనిచ్చాడు. ఈ ఘటనను అక్కడున్న ఇతర ప్రయాణికులు వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. సమోసా విక్రేతపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. చివరికి దీనిపై స్పందించిన పోలీసులు ఆ సమోసా విక్రేతపై కేసు నమోదు చేశారు. 

Also read: భారత్‌కు రానున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

Advertisment
తాజా కథనాలు