Dowry: కట్నం కోసం వేధింపులు.. నోట్లో వేడివేడి కత్తి పెట్టి.. ఇంకా చెప్పలేని ఘోరాలు!
కట్నం కోసం ఓ భర్త తన భార్యని దారుణంగా హింసించాడు. ఆమెని తాళ్లతో కట్టేసి, వేడి చేసిన కత్తితో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గాన్ జిల్లాలో చోటు చేసుకుంది. కత్తితో తన చేతులు, కాళ్లపై కాల్చి గాయపరిచాడని బాధితురాలు వాపోయింది.