Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోరం: భార్య ప్రైవేట్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన భర్త!

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. రేవా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. తన సొంత భార్య ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి, దానిని సోషల్ మీడియాలో

New Update
husband

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) లో దారుణం జరిగింది. రేవా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. తన సొంత భార్య ప్రైవేట్ వీడియో(Wife Private Videos) ను రికార్డ్ చేసి, దానిని సోషల్ మీడియా(Social Media) లో పెట్టడమే కాకుండా బంధువులకు కూడా పంపిన ఉన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టు జుడీషియల్ కస్టడీకి పంపింది.

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు శివం సాహుకు 2025, మే 10న వివాహమైంది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే వరకట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. వివాహ సమయంలో 3 లక్షల రూపాయల కట్నం డిమాండ్ చేయగా, బాధితురాలి కుటుంబం 2 లక్షలు చెల్లించింది. మిగిలిన లక్ష రూపాయల కోసం నిందితుడు ఆమెను శారీరక, మానసిక హింసకు గురిచేసేవాడు.

Also Read :  ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం.. 20 మందికి తీవ్రగాయాలు!

సోషల్ మీడియాలో పోస్ట్ చేసి

2025 డిసెంబర్‌లో శివం తన భార్యకు తెలియకుండా ఆమె ప్రైవేట్ వీడియోను చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆమె బంధువులందరికీ పంపాడు. దీనిపై భార్య అభ్యంతరం తెలపగా, ఆమెను మరింత బద్నాం చేస్తానని బెదిరించాడు. నిందితుడికి ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన కంటెంట్ చూసే అలవాటు ఉందని పోలీసు విచారణలో తేలింది.

ఈ వ్యవహారం బయటపడటంతో నిందితుడు ముంబైకి పారిపోయి దాక్కున్నాడు. అయితే, ఫిబ్రవరి 12న ఆయుధంతో తన అత్తగారి ఇంటికి వచ్చి, బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం మొదలుపెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్‌తో అతడిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం నిందితుడిపై వరకట్న వేధింపులు, క్రిమినల్ బెదిరింపులు, ప్రైవేట్ వీడియోలను సర్క్యులేట్ చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలికి చట్టపరమైన రక్షణ కల్పిస్తున్నామని, విచారణను వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు.

Also Read :  ఆన్‌లైన్‌లో ఆయుధాలు ఆర్డర్.. మర్డర్ కేసులో బ్లింకిట్‌పై కేసు

Advertisment
తాజా కథనాలు