Madhya Pradesh : నిశ్చితార్థానికి ముందు ఊహించని ట్విస్ట్! వధువు తండ్రితో వరుడి తల్లి జంప్

తమ పిల్లల నిశ్చితార్థానికి కొద్ది రోజుల ముందు వధువు తండ్రి, వరుడి తల్లి ఒకరితో ఒకరు పారిపోయిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల వివాహ ప్రయత్నాలు రద్దయ్యాయి.

New Update
madhya pradesh

తమ పిల్లల నిశ్చితార్థానికి కొద్ది రోజుల ముందు వధువు తండ్రి, వరుడి తల్లి ఒకరితో ఒకరు పారిపోయిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల వివాహ ప్రయత్నాలు రద్దయ్యాయి. ఉజ్జయిని జిల్లాలోని బద్‌నగర్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల రైతు (వధువు తండ్రి), ఉంట్‌వాసా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ (వరుడి తల్లి) సుమారు ఎనిమిది రోజుల క్రితం ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. పోలీసుల విచారణలో తేలిన విషయం ఏంటంటే, ఈ ఇద్దరూ తమ పిల్లల పెళ్లి ఏర్పాట్లలో భాగంగా తరచుగా కలుసుకోవడం వల్ల ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో కలిసి పారిపోవాలని నిర్ణయించుకున్నారు.

తన తల్లి కనిపించడం లేదని

మహిళ కుమారుడు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మహిళను చిక్లీ గ్రామంలో ఆమె ప్రేమికుడితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తిరిగి రావాలని కోరినా, ఆమె నిరాకరించింది. తాను తన ప్రేమికుడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది. ఇద్దరూ మేజర్లు కావడం వల్ల ఈ విషయంలో ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేమని పోలీసులు తెలిపారు. అయితే, తల్లిదండ్రుల ఈ అనూహ్య నిర్ణయంతో నిశ్చితార్థం రద్దై, ఇరు కుటుంబాలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డాయి.

Advertisment
తాజా కథనాలు