Drinkers: మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. తాగిపడిపోతే ఆ సేవలు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. మద్యం సేవించి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వాళ్లకోసం డ్రైవర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

New Update
Driver Services For Drinkers in indore

Driver Services For Drinkers in indore

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. మద్యం సేవించి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వాళ్లకోసం డ్రైవర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇందులో క్యాబ్‌కు బదులుగా డ్రైవర్‌ను వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో బుక్‌ చేసుకోవాలి. ఇందులో డ్రైవర్‌ 30 నుంచి 40 నిమిషాల్లోపు నిర్దిష్ట ప్రాంతానికి చేరుకుంటారు. ఈ డ్రైవర్‌ తనను బుక్‌ చేసుకున్న వాళ్లను సొంత కారులోనే ఇంటి దగ్గర క్షేమంగా దిగబెడతారు.  

Also Read: యోగి ఆధిత్యనాథ్‌ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు బ్రేక్

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం వల్ల విధించే జరిమానాలు అరికట్టేందుకే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు వాహనాన్ని తిరిగి పొందేందుకు, కోర్టు ఖర్చుల కోసం మరికొంత సొమ్ము భరించాల్సి ఉంటుంది. దీంతో గంటకు రూ.200, రెండు గంటలకు రూ.300, నాలుగు గంటలకు రూ.400 వసూలు చేసే ఈ డ్రైవర్‌ సేవలు రాత్రి వేళల్లో మందుబాబులు ఎక్కువగా వాడుకుంటున్నారు. 

Also Read: షేక్ హ‌సీనాకు బిగ్‌షాక్.. ప‌దేళ్లు జైలుశిక్ష‌

Advertisment
తాజా కథనాలు