Indore Crime: లవర్ ను చంపేసి క్షుద్ర పూజలు.. శవంతోనే శృంగారం చేసి పరార్!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో పీయూష్ ధామ్నోటియా

New Update
indore

Indore Crime

Indore Crime: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ఇండోర్‌లో ఒక ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో పీయూష్ ధామ్నోటియా అనే యువకుడు ఆమెను అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా, ఆ తర్వాత అతడు చేసిన పనులు పోలీసులనే విస్మయానికి గురిచేశాయి.

పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 10న నిందితుడు పీయూష్, బాధిత యువతిని తన గదికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి చంపేశాడు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక కూడా, ఆమె ఛాతీపై కత్తితో బలంగా పొడిచాడు. హత్య తర్వాత శవం పక్కనే కూర్చుని మద్యం సేవించిన నిందితుడు, అనంతరం ఆమె ఫోన్ నుండి అసభ్యకరమైన వీడియోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి అక్కడి నుండి పరారయ్యాడు. అంతేకాకుండా అతను శవంపై లైంగిక దాడి చేసి, బట్టలు మార్చుకుని పారిపోయాడు. ఆ యువతిని నగ్నంగా వదిలివేసాడు.

Also Read: జర్మన్ స్టూడియో సంచలనం! AIతో ఒకే రోజు $200 మిలియన్ల సినిమా..

హత్య అనంతరం ముంబై పారిపోయిన నిందితుడు పన్వేల్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. అక్కడ ఒంటరిగా ఉన్న సమయంలో యూట్యూబ్‌లో స్త్రీ ఆత్మలను ఎలా పిలవాలి అనే వీడియోలు చూస్తూ, తాను చంపిన యువతి ఆత్మతో మాట్లాడాలని క్షుద్ర పూజలు చేసినట్లు విచారణలో తేలింది. ఘటనా స్థలంలో అగరుబత్తులు వెలిగించి, తాను చేసిన పనికి క్షమించమని ఆత్మను వేడుకున్నట్లు సమాచారం. అతడి ప్రవర్తన చూసి నిందితుడు మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: వినియోగంలో రూ.40 లక్షల కోట్ల నగదు

సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని ముంబైలో అరెస్ట్ చేసిన ఇండోర్ పోలీసులు, ప్రస్తుతం మూడు రోజుల రిమాండ్‌లో ఉంచి విచారిస్తున్నారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా ఆమె వేరే వారితో మాట్లాడుతోందన్న అసూయతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో కత్తి, తాడు, డిజిటల్ సాక్ష్యాలను సేకరించాయి.

Also Read: మణికొండలో పైప్‌లైన్‌ బ్లాస్ట్‌ కాలనీలను ముంచెత్తిన వరద

హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఆ విద్యార్థిని తన ఆధార్ కార్డును సరిచేయాలని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది. ఆమె తండ్రి ఆమెను కలెక్టరేట్ దగ్గర దింపాడు. తరువాత ఆమె తన చెల్లెలికి ఫోన్ చేసి, తన క్లాస్‌మేట్ పియూష్ ధమ్నోటియాతో కలిసి పుట్టినరోజు పార్టీకి వెళ్తున్నానని, రాత్రి 11 గంటలకు తిరిగి వస్తానని చెప్పింది.  రాత్రి 11 గంటలకు ఆమె రాలేదు.   ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుంటుబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 

Advertisment
తాజా కథనాలు