కాంగ్రెస్ MLA షాకింగ్ కామెంట్స్.. 'ఆ కులం అమ్మాయిల్ని అత్యాచారం చేస్తే పుణ్యం'

ఒక బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉండి.. అసభ్యంగా మాట్లాడిన ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రజాప్రతినిధులు మహిళల రక్షణ గురించి మాట్లాడాల్సింది పోయి, అత్యాచారాలను సమర్థించేలా వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

New Update
MLA

ఒక బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉండి.. అసభ్యంగా మాట్లాడిన ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రజాప్రతినిధులు మహిళల రక్షణ గురించి మాట్లాడాల్సింది పోయి, అత్యాచారాలను సమర్థించేలా వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని భండేర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరయ్య అత్యాచారాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది.

ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ, బరయ్య అత్యాచారాలకు కులాన్ని, వర్గాన్ని అంటగడుతూ అసహ్యకరమైన రీతిలో మాట్లాడారు. సమాజంలో కొన్ని కులాల మహిళలపై లైంగిక దాడి చేస్తే తీర్థయాత్రలకు వెళ్లినంత పుణ్యం దక్కుతుందనే నమ్మకం కొందరిలో ఉందని, ఈ విషయం కొన్ని పుస్తకాల్లో కూడా ఉందని ఆయన అన్నారు. అంతటితో ఆగక "రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే పురుషుడి మనస్సు చలించి అత్యాచారానికి పాల్పడే అవకాశం ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. అంటే అత్యాచారానికి కారణం మహిళల అందమే అన్నట్లుగా ఆయన మాట్లాడటం గమనార్హం.

కొన్ని వర్గాల మహిళలు అందంగా ఉండకపోయినా, వారితో శారీరక సంబంధం కలిగి ఉంటే ఏదో లాభం వస్తుందనే ఉద్దేశంతోనే దాడులు జరుగుతున్నాయని హీనంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ, వివిధ కుల సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. "ఇదేనా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి? మహిళల పట్ల మీ ఎమ్మెల్యేకి ఉన్న గౌరవం ఇదేనా?" అని బీజేపీ ప్రశ్నించింది. ఆల్ ఇండియా బ్రాహ్మణ పరిషత్ నేత పండిత్ పుష్పేంద్ర మిశ్రా స్పందిస్తూ.. బరయ్య వ్యాఖ్యలు ఆయన నీచ బుద్ధికి నిదర్శనమని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ వివరణ
ఈ వివాదం ముదిరిపోవడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి స్పందించక తప్పలేదు. ఎమ్మెల్యే పూల్ సింగ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. "అత్యాచారం అనేది నేరం. నేరస్థుడికి కులం, మతం ఉండవు. దాన్ని ఏ విధంగానూ సమర్థించలేం" అని పట్వారి పేర్కొన్నారు. మహిళా హక్కుల సంఘాలు సైతం బరయ్యను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని, అత్యాచారాలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు