Diwali Carbide Gun: చీకటి నింపిన దీపావళి.. కంటిచూపు కోల్పోయిన 14 మంది పిల్లలు

మధ్యప్రదేశ్‌లో దీపావళి వేడుకలు 14 మంది చిన్నారుల జీవితాల్లో విషాదాన్ని నింపాయి. 'కార్బైడ్ గన్'తో ఆడుతూ జరిగిన ప్రమాదంలో దాదాపు 14 మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.

New Update
Carbide Gun

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో దీపావళి వేడుకలు 14 మంది చిన్నారుల జీవితాల్లో విషాదాన్ని నింపాయి. 'కార్బైడ్ గన్'తో ఆడుతూ జరిగిన ప్రమాదంలో దాదాపు 14 మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. దీపావళి(Diwali 2025) మరుసటి రోజు నుండే కార్బైడ్ గన్ ప్రమాద బాధితులు ఆసుపత్రికి క్యూ కట్టారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, 8 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల 60 మందికి పైగా చిన్నారులు గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురికి కంటికి, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read :  ఘోర విషాదం.. రైలు ఢీకొని మహిళ, కూతురు సహా నలుగురు మృతి

Kids Lose Eyesight By Playing With Carbide Gun On Diwali

కాల్షియం కార్బైడ్ ఉపయోగించి ఇంట్లోనే తయారు చేసుకునే ఈ తాత్కాలిక ‘కార్బైడ్ గన్’ అత్యంత ప్రమాదకరమని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనీష్ శర్మ తెలిపారు. ప్లాస్టిక్ పైపు, గ్యాస్ లైటర్, కాల్షియం కార్బైడ్‌తో దీనిని తయారు చేస్తారు. కాల్షియం కార్బైడ్ నీటితో కలిసినప్పుడు ఎసిటిలీన్ వాయువు ఉత్పత్తి అవుతుంది, దీనిని మండించినప్పుడు పేలుడు సంభవిస్తుంది. ఈ పేలుడు కారణంగా ప్లాస్టిక్ పైపు శకలాలు బుల్లెట్ల మాదిరిగా అధిక వేగంతో దూసుకుపోయి, కళ్ళు, ముఖం, చర్మానికి తీవ్ర గాయాలు చేస్తాయి.

Also Read :  ఇరుముడితో శబరిమల మెట్లెక్కిన రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము.. ఫొటోలు చూశారా?

దాదాపు 125కి పైగా కార్బైడ్ గన్ ప్రమాద కేసులు భోపాల్ వ్యాప్తంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. చాలా మంది ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినప్పటికీ, చాలా మంది పిల్లలు తీవ్ర గాయాలతో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. AIIMS మరియు హమీదియా ఆసుపత్రుల్లో పలువురు పిల్లలకు కంటి చూపు పునరుద్ధరణకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వీటి అమ్మకాలను నిరోధించాలని ఆదేశించినప్పటికీ, స్థానిక మార్కెట్లలో ఇవి విరివిగా అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ ప్రమాదకరమైన పరికరాల అమ్మకాలను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం అక్రమ తయారీ, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు కూడా ఇలాంటి ప్రమాదకరమైన ఆటవస్తువులను పిల్లలకు అందుబాటులో ఉంచవద్దని అధికారులు హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు