Telangana Traffic Police: తెలంగాణలో కళ్లుచెదిరే ఇన్సిడెంట్.. ఒక్క బండికి 233 చలాన్లు - షాకైన పోలీసులు
ఒక్క టూవీలర్‌పై వందల్లో చలాన్లు దర్శనమివ్వడంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఖంగుతిన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేశారు. అటువైపుగా వచ్చిన ఓ స్కూటీని ఆపి పెండింగ్ చలాన్లను చెక్ చేయగా 233 చలాన్లు ఉండటంతో షాకయ్యారు.