Bihar Elections 2025: సర్వే సంస్థలని 2సార్లు బురిడీ కొట్టించిన బిహారీలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు.. మరీ ఈసారి!?

డాక్టర్ పేషెంట్ నాడి పట్టుకొని జబ్బు ఏంటో చెప్పగలడు.. కానీ ఓటరు నాడి పట్టుకొని ఓ పార్టీ గెలుస్తోందో చెప్పడం కష్టం. అయినా సరే ఫలితాలు రాకముందే ఏ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందో కచ్చితంగా చెప్పగలం అని అంటూ కొన్ని సర్వే సంస్థలు అంచనాలు వెల్లడిస్తున్నాయి.

New Update
Bihar Assembly elections

డాక్టర్ పేషెంట్ నాడి పట్టుకొని జబ్బు ఏంటో చెప్పగలడు.. కానీ ఓటరు నాడి పట్టుకొని ఓ పార్టీ గెలుస్తోందో చెప్పడం కష్టం. అయినా సరే ఫలితాలు రాకముందే ఏ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందో కచ్చితంగా చెప్పగలం అని అంటూ కొన్ని సర్వే సంస్థలు అంచనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బిహార్ ఎన్నికలు(Bihar Assembly Elections 2025) రాజకీయంగా కాక రేపుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవల రెండు దశల్లో 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. రేపు (నవంబర్ 14) ఫలితాలు విడుదల కానుంది. రెండు కూటములు NDA, MGB మధ్య ప్రధాన పోరు నడుస్తోంది.

ఎగ్జిట్ పోల్స్‌(bihar elections exit polls) లో దాదాపు అన్నీ సర్వే సంస్థలు NDAకు గెలుపు ఖాయమన్నట్లు అంచనాలు వేశాయి. 243 నియోజకవర్గాలు ఉన్న బిహార్‌లో 122 సీట్లు ఏ కూటమి గెలిస్తే ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మ్యాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, పీపుల్స్ పల్స్ వంటి సర్వే సంస్థలు 130 సీట్లకు పైగా ఎడ్డీఏ గెలుచుకుంకుంటుందని చెప్పాయి. ఏ ఒక్క సర్వే సంస్థ కూడా బిహార్‌లో కాంగ్రెస్‌ నేపథ్యంలో మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పలేదు. బిహార్ ప్రజలు మళ్లీ నితీష్ సర్కార్‌కే జై కొడతాయని చాణక్య స్ట్రాటజీస్, డీవీ రీసెర్చ్, దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గతంలో ఎగ్జిట్ ఫలితాలు ఒక్కసారి కాదు.. రెండుసార్లు కూడా నిజం కాలేదు. బిహార్ ప్రజలు 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ ప్రజలు సర్వే సంస్థలను బురిడీ కొట్టించారు. అసలు ఆ ఎలక్షన్‌లో ఏం జరిగిందో చూద్దాం..

Also Read :  Delhi Redfort Blast: ఢిల్లీ పేలుడులో మరో ట్విస్ట్.. తప్పిపోయిన బ్రెజా కారు లభ్యం..

2015లో అంచనాలకు దూరంగా ఎగ్జిట్ పోల్స్..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2015లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దూరంగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో నితీష్ కుమార్ (JDU), లాలూ ప్రసాద్ యాదవ్ (RJD), కాంగ్రెస్ కలిసి మహాఘటబంధన్గా ఏర్పడ్డాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలో NDA, మహాఘటబంధన్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంచనా వేశాయి. కొన్ని సర్వేలు NDAకే స్వల్ప ఆధిక్యం ఉంటుందని కూడా చెప్పాయి. సగటున, మహాఘటబంధన్‌కు 123 సీట్లు, NDAకు 114 సీట్లు రావొచ్చని అంచనా వేశారు. ఫలితం మాత్రం పోల్స్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. బిహార్ అసెంబ్లీ ఫలితాల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. మహాఘటబంధన్ 178 సీట్లతో తిరుగులేని విజయాన్ని సాధించింది. NDA కేవలం 58 సీట్లకే పరిమితమై ఘోరంగా ఓడిపోయింది.

Also Read :  హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో దొరికిన మరిన్ని విషపదార్థాలు..గుంటూరులోనూ..

2020 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రివర్స్!

2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఓటర్లు పూర్తిగా తలక్రిందులు చేశారు. చాలావరకు సర్వే ఏజెన్సీలు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేతృత్వంలోని మహాఘటబంధన్ (MGB) విజయం సాధిస్తుందని, సుమారు 125 సీట్లతో (మెజారిటీ మార్క్ 122) అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కు 108 సీట్ల వరకు రావొచ్చని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. బిహారీలు అంచనాలకు ఉహించని పార్టీకి పట్టం కట్టారు. NDA 125 సీట్లు గెలుచుకుని స్వల్ప మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. మహాఘటబంధన్ కేవలం 110 సీట్లకే పరిమితమైంది. పొలిటిక్ మార్కర్ వంటి కొన్ని ఏజెన్సీలు, అలాగే ఏబీపీ న్యూస్-సీ ఓటర్, పీ-మార్క్ సంస్థలు మాత్రమే NDA స్వల్ప మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అంచనా వేసి తుది ఫలితాలకు దగ్గరగా వచ్చాయి.

గత రెండు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాలేదు. ముఖ్యంగా 2020లో మెజారిటీ పోల్స్ మహాఘటబంధన్‌కు విజయాన్ని అంచనా వేసినా, గెలిచింది NDA. అందువల్ల బీహార్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను జాగ్రత్తగా తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. లేదా ఈ సారి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొందరు. ఈ సారి కూడా ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అవుతాయని మహాఘట్బంధన్ కూటమిలోని కాంగ్రెస్‌, ఆర్జేడీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తూ మేమే అధికారంలోకి వస్తామని అంటున్నారు. మరి చూద్దాం.. రేపు ఈ టైంకి బిహార్ భవిష్యత్ తేలిపోద్ది.

Advertisment
తాజా కథనాలు