/rtv/media/media_files/2025/11/11/delhi-blast-2025-11-11-10-22-24.jpg)
Delhi Blast
Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరో వ్యక్తి మరణించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. సాయంత్రం 7 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు జరిగింది.
ఈ ఘటనలో అక్కడికక్కడే తొమ్మిది మంది మరణించారు. మరో 20 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మిగతావారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
Also Read: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర
ఈ పేలుడు కేసు కేంద్రం NIAకి అప్పగించింది. దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేశాయి. నిన్న కేంద్ర కేబినెట్ ఈ బాంబు దాడిని ఉగ్రవాద చర్యగా గుర్తించింది. దీని వెనుక ఉన్న వారిని న్యాయం ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు. యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు దేశవ్యాప్తం పలు నగరాల్లో ఈ ఉగ్రవాదుల నెట్‌వర్క్‌లో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also Read: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
ఈ క్రమంలో ఢిల్లీ బాంబు బ్లాస్ట్ వెనుక కుట్రలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హర్యాన ఫరియాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీలో ముగ్గురు డాక్టర్ల పేలుడు కుట్రలో ఉన్నారని తెలిసింది. ఇప్పటివరకు దాదాపు 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్, గుజరాత్, కలకత్తా, ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని కీలక నగరాల్లో సోదాలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. టెర్రర్ మడ్యూల్ వెనుక ఎవరెవరు ఉన్నారని పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: భార్యాభర్తల మధ్య లొల్లి పెట్టిన కుక్క.. కోర్టు మెట్టులెక్కిన భర్త!
Follow Us