Jigris Movie Review: జాతిరత్నాలనే మరిపించిన జిగ్రీస్ మూవీ.. రివ్యూ ఎలా ఉందంటే?

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జిగ్రీస్ మూవీ నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. అయితే నేడు ప్రీమియర్ షోలు వేయగా.. ఫుల్ మూవీ రివ్యూ వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

New Update

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జిగ్రీస్ మూవీ నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఫ్రెండ్‌షిప్, అడ్వెంచర్స్, ఎమోషన్స్‌ ఉన్నాయి. మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కృష్ణ వోడపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే నేడు ప్రీమియర్ షోలు వేయగా.. ఫుల్ మూవీ రివ్యూ వచ్చేసింది. మరి ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

సినిమా ఎలా ఉందంటే?

టైటిల్ కి తగ్గట్టే ఇది నలుగురు జీగ్రీస్ కథ. ఇలాంటి సినిమాలలో కథ అంతగా ఉండదు. ఉండాల్సిందల్లా కామెడీ. ప్రతీ సీన్ ని హిలేరియస్ మెప్పించాలి. ఒకొక్క సీన్ పేర్చుతూ వెళ్లి నవ్వించగలిగితే చాలు సినిమా నిలబడుతుంది. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ముఖ్యంగా లారీ సీన్, ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్ నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా కాండోమ్ సీన్ హిలేరియస్ గా నవ్విస్తుంది. మావోయిస్టుల బ్లాక్ కూడా ఓ మాదిరిగానే మెప్పిస్తుంది. జిగ్రీస్.. కథలో అహా ఓహో అనే మలుపులు ఉండవు. కానీ అరే మన గ్యాంగ్ కూడా ఇలాంటిదే కదా, మన ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వాళ్లే కదా అనిపిస్తుంది. మన కథని మనం తెరపై చూసుకుంటున్నట్టు ఉంటుంది. కానీ చివర 15 నిమిషాలు మాత్రం మనసుని ఎంతో బరువెక్కిస్తుంది. అలా జరగకుండా ఉంటే బాగుండేది కదానిపిస్తుంది. తడిసిన కళ్లతో చెమర్చిన భావోద్వేగంతో బయటకు వస్తారు. జాతిరత్నాలనే ఈ సినిమా మరిపించిందని ప్రేక్షకులు అంటున్నారు.

ఎవరెలా చేసారంటే?
లీడ్ రోల్ చేసిన కృష్ణ బూరుగుల పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు స్టీల్ చేసాడు. రామ్ నితిన్ పర్లేదు బానే చేసాడు. ధీరజ్ ఆత్రేయచాలా సహజంగా అమాయమైన నటనతో కామెడీ పండించాడు.  మనీ వాక సినిమాలో కీలకమైన పాత్ర, అసలు కథ మెుత్తం తన చుట్టూనే తిరుగుతుంది. అయితే ఎమోషన్ సీన్స్ నటనలో అనుభవం ఇంకొంత అవసరం. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ గా బాగుంది. కమ్రాన్ మ్యూజిక్ గుడ్. ప్రోడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మన చిన్ననాటి జాన్ జిగ్రిలతో గడిపిన క్షణాలని మరోకసారి గుర్తు చేసే సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఫ్రెండ్స్‌తో వెళ్తే నవ్వుకోవచ్చని ప్రేక్షకులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Priyanka Chopra: "వరల్డ్‌’స్ వరస్ట్ కేప్ట్ సీక్రెట్!" ప్రియాంక చోప్రా క్రేజీ వీడియో బైట్ వైరల్!!

Advertisment
తాజా కథనాలు