Arattai App: టాప్ 100 నుంచి పడిపోయిన అరట్టై యాప్.. జోహో ఓనర్ రియాక్షన్ ఇదే!

జోహో సీఈఓ శ్రీధర్ వేంబు 'అరట్టై' టాప్ 100 యాప్‌ల లిస్ట్ నుంచి పడిపోవడంపై వస్తున్న విమర్శలకు దీటుగా స్పందించారు. ఈ యాప్‌ తాము దీర్ఘకాలిక లక్ష్యంగా రూపొందిస్తున్నామని, ఇది ఐదు నుంచి 15 ఏళ్ల ప్రాజెక్టుగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.

New Update
G5jZbBIbUAEDAYF

Arattai App

Arattai App: జోహో వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీధర్ వేంబు స్వదేశీ మెసేజింగ్ యాప్ 'అరట్టై' టాప్ 100 యాప్‌ల లిస్ట్ నుంచి పడిపోవడంపై వస్తున్న విమర్శలకు దీటుగా స్పందించారు. ఈ యాప్‌ను తాము స్వల్పకాలిక లక్ష్యంగా కాకుండా, దీర్ఘకాలికంగా రూపొందిస్తున్నామని, ఇది ఐదు నుంచి 15 ఏళ్ల ప్రాజెక్టుగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. "ఏదీ కూడా నిరంతరం పైకే వెళ్లదు. వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. ఏదో లోపం జరిగిందనే ఆలోచనే సరికాదు," అని వేంబు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అరట్టై ర్యాంకింగ్ పడిపోవడంపై ఆందోళన చెందవద్దని, ఇది వ్యాపారంలో ఒక సహజ పరిణామమని ఆయన అన్నారు. "నెంబర్ వన్ స్థానం దక్కించుకోవడం అనేది పెద్ద విషయం కాదని నేను మా ఉద్యోగులకు చెప్పాను. ఆ పరిస్థితి ఎంతో కాలం ఉండదని కూడా చెప్పాను," అని ఆయన తెలిపారు.

Also Read: భార్యాభర్తల మధ్య లొల్లి పెట్టిన కుక్క.. కోర్టు మెట్టులెక్కిన భర్త!

ప్రస్తుతం ర్యాంకింగ్ పడిపోవడంపై విమర్శలు చేస్తూ, సరదాగా మాట్లాడుకుంటున్నవారు తమ కాలం వృథా చేసుకుంటున్నారని శ్రీధర్ వేంబు వ్యాఖ్యానించారు. తాము విమర్శలకు సమయం వృథా చేయకుండా, కోడ్ మీద, యాప్ డెవలప్‌మెంట్ మీద దృష్టి పెడుతున్నామని అన్నారు. అరట్టై కోసం జోహో గత పది సంవత్సరాలుగా మెసేజింగ్ టెక్నాలజీపై పనిచేస్తోందని, అందువల్ల ఈ ఒక్క నెలలో ర్యాంకింగ్ తగ్గుదల తమకు ఏ మాత్రం పట్టదని స్పష్టం చేశారు. "మాకు ఇది 5, 10, 15 ఏళ్ల ప్రయాణం. మేం పటిష్టమైన యాప్‌ను రూపొందిస్తున్నాం, అది మరింత శక్తిమంతం అవుతుంది," అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర

మెసేజింగ్ యాప్ మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని నివారించడానికి పటిష్టమైన పోటీ ఉండటం చాలా అవసరమని వేంబు నొక్కి చెప్పారు. పోటీ ఉన్నప్పుడే మార్కెట్‌లోని పెద్ద సంస్థలు కూడా నిజాయితీగా ఉంటాయని, అందుకే అరట్టై వంటి దేశీయ యాప్‌లు నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం అరట్టైలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను వేగవంతం చేస్తున్నట్లు, మరో రెండు వారాల్లో బ్యాకప్‌ సపోర్ట్‌తో పాటు ముఖ్యమైన అప్‌డేట్‌లు అందుబాటులోకి వస్తాయని శ్రీధర్ వేంబు తెలియజేశారు.

Advertisment
తాజా కథనాలు