/rtv/media/media_files/2025/11/13/fdjk_45a45e30f6-2025-11-13-10-00-37.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు ఇచ్చిన పార్టీ నాయకులు ఓటు వేయని వారి వాటిని తిరిగి ఇచ్చాయాలని డిమాండ్ చేస్తున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ 48.49శాతంగా తేలింది. దీన్ని బట్టి చూస్తూ ఓటర్లలో సగం మంది కూడా ఓటు వేయడానికి రాలేదు. దీంతో ఓటెయ్యని వారు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే అని బూత్ కమిటీ సభ్యులు అంటున్నారు. ఓటర్లుకు దాదాపు ఒక్కో ఓటుకు రూ.2వేలు నుంచి రూ.5వేలు వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటెయ్యని వారిని పార్టీల నేతలు గుర్తిస్తున్నారు. వారిలో పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయనివారిని ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని అడగుతున్నారు పలు పార్టీల నాయకులు. ఓ ఇంట్లో 18 ఓట్లుంటే కేవలం నాలుగే ఓట్లు పోలయ్యాయి. మిగిలిన 14 మందీ డబ్బులిచ్చేయాలని నేతల డిమాండ్ చేస్తున్నారు. ఓటెయ్యని వారి నుంచి డబ్బులు వసూలు చేసి కాలనీల్లో పనులు చేయాలని నిర్ణయించుకున్నారు. అపార్టమెంట్లలో సగం మందీ ఓటెయ్యని వైనం.. ఓటెయ్యని వారినుంచి డబ్బులు తీసుకోవడం కరక్టే అని స్థానికులు అంటున్నారు.
వాళ్ళు పైసలు ఇచ్చారు, అందుకే ఓటేశాం
— RTV (@RTVnewsnetwork) November 11, 2025
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సంచలన నిజాలు బయటపెట్టిన ప్రజలు pic.twitter.com/YjDZ7WHcDx
ఆర్టీవీ రిపోర్టర్‌తో మహిళా ఓటరు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని చెప్పింది. ఇంట్లో ఎనిమిది మంది ఉంటే ఇద్దరికే డబ్బులు ఇచ్చారని, అందుకే ఇద్దరే ఓటు వేశామని జూబ్లీహిల్స్ మహిళా ఓటర చెప్పడం కూడా ఆశ్చర్యంగా ఉంది. ఆ వీడియో వైరల్ అయ్యింది.
Follow Us