Jubilee Hills By-Elections Counting: రేపే జూబ్లీహిల్స్‌ కౌంటింగ్‌... 10 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి

రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ శుక్రవారం జరగనుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా వారిలో1,94,631 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

New Update
dea

Jubilee Hills By-Elections

రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌(Jubilee Hills By-Election Counting) శుక్రవారం జరగనుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా వారిలో1,94,631 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం 48.49% పోలింగ్ నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(jubilee hills by elctions) ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే  అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆర్వో కర్ణన్‌ తెలిపారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో ఉన్న డీఆర్సీ సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Also Read :  తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!

Jubilee Hills By-Elections Counting

‘‘శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. 407 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తాం. పోటీలో మొత్తం 59 మంది అభ్యర్థులు ఉండటంతో  ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. మొదట షేక్ పేట్ డివిజన్ లెక్కింపు ప్రారంభమవుతుందని, చివరన ఎర్రగడ్డ డివిజన్ వద్ద ముగుస్తుందన్నారు.మొత్తం10 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తిచేస్తామని కర్ణన్‌ వివరించారు. కౌంటింగ్‌కు మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించాం. ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాం. మీడియాకు ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేసి ఫలితాలను వెల్లడిస్తాం’’అని ఆయన వెల్లడించారు.

ఇక ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని నగర జాయింట్‌ సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ తెలిపారు. భద్రత కోసం15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని.. అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని ఆయన సూచించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read :  జూబ్లీహిల్స్ బైపోల్: డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు ఇలా..!

Advertisment
తాజా కథనాలు