Health Tips: ఉదయం లేచిన వెంటనే గొంతు ఎండిపోతున్నట్లు అనిపిస్తుందా? అయితే మీకు ఈ 6 సమస్యలు ఉన్నట్లే!

కొందరికి ఉదయం లేచిన వెంటనే గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుంది. వాటర్ తాగకపోవడం, గాలి వంటి కారణాల వల్ల అనిపిస్తుందని అనుకుంటారు. అయితే ఇది కొన్నిసార్లు స్లీప్ అప్నియా లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి అనారోగ్య సమస్యలకు హింట్ ఇస్తుందని నిపుణులు అంటున్నారు.

New Update
Throat Phlegm

Throat

కొందరికి ఉదయం లేచిన వెంటనే గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుంది. వాటర్ తాగకపోవడం, గాలి వంటి కారణాల వల్ల అనిపిస్తుందని అనుకుంటారు. అయితే ఇది కొన్నిసార్లు స్లీప్ అప్నియా లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి అనారోగ్య సమస్యలకు హింట్ ఇస్తుందని నిపుణులు అంటున్నారు.  ముఖ్యంగా ఆరు సమస్యలు ఉంటేనే ఇలా గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సమస్యలేంటో తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

ఇది కూడా చూడండి: Relationship Tips: మీ పార్ట్‌నర్‌కు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు.. ఈ చిన్న బహుమతులే వెలకట్టలేని ఆనందం!

స్లీప్ అప్నియా ఉన్నవారు..

నిద్రపోతున్నప్పుడు ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా గాలి పీల్చడం వల్ల గొంతులోని కణజాలాలు నేరుగా ఎండిపోతాయి. ఇది నాసికా రద్దీ, సెప్టం విచలనం లేదా స్లీప్ అప్నియా వంటి సమస్యల వల్ల సంభవించవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే దీన్ని తగ్గించుకోవాలి. లేకపోతే ముక్కుకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి గదిలో హ్యూమిడిఫైయర్ ఉపయోగించాలి. లేదంటే నాసల్ స్ప్రేలు లేదా సెలైన్ సొల్యూషన్లు ఉపయోగించాలి. కొన్నిసార్లు ఆమ్లం అన్నవాహిక ద్వారా గొంతులోకి ప్రయాణించి, గొంతు పొడిబారడానికి లేదా నొప్పికి కారణమవుతుంది. ఈ పరిస్థితిని లారింగోఫారింజియల్ రిఫ్లక్స్ అంటారు. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలా కాకూడదంటే.. పడుకునే 2-3 గంటల ముందు మీ భోజనం పూర్తి చేయాలి.

కెఫిన్, వేయించిన ఆహారాలు మరియు రాత్రిపూట స్నాక్స్ మానుకోండి. డీహైడ్రేషన్, పొడి గాలి,  తగినంత నీరు తాగకపోవడం లేదా ఎయిర్ కండిషనింగ్/హీటర్ ఆన్ చేసి నిద్రపోవడం ఇవన్నీ గొంతు ఎండిపోవడానికి ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అలాగే మధ్య రాత్రిలో కూడా కాస్త వాటర్ తీసుకోండి. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ కాదు. కొందరికి స్లీప్ అప్నియా లేదా గురక సమస్యలు ఉన్నవారికి కూడా గొంతు పొడిబారుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే అసలు లైట్ తీసుకోవద్దు. పొరపాటున లైట్ తీసుకుంటే.. సైనస్, కాలేయ సమస్యలు, గుండె పోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏ మాత్రం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు అని నిపుణులు అంటున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి:  Health Tips: భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే అంత డేంజరా?.. షాకింగ్ నిజాలు..!

Advertisment
తాజా కథనాలు