Telangana Legislative Coucil: తెలంగాణ శాసన మండలి వాయిదా..
తెలంగాణ శాసనమండలి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు వాయిదా వేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు 10.30 గంటలకు తొలిరోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ శాసనమండలి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు వాయిదా వేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు 10.30 గంటలకు తొలిరోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
హదీ హత్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇంకిలాబ్ మోంచా.. ఇప్పుడు భారతీయులపై విషం కక్కింది. బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ లీడర్లు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఆదివారం అర్థరాత్రి ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా సుమారు 2 వేల మందిని మరో ట్రైన్ లో సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చారు.
తాజాగా ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తుది గడువు ఏమి లేదన్నారు. యుద్ధం ముగింపు పైనే ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.
అభిమానుల అత్యుత్సాహంతో దళపతి, టీవీకే అధినేత విజయ్ చెన్నై విమానశ్రయంలో ఇబ్బంది పడ్డారు. విజయ్‌ని చూడడం కోసం అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో గందరగోళం నెలకొంది. విజయ్ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కిందపడ్డారు.
పిల్లల పెంపకంపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రమశిక్షణతో పిల్లలను పెంచే బాధ్యతను తల్లి పట్టించుకోకపోతే కుటుంబం, సమాజం పునాదులు కూలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఓ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు గతం కంటే వాడీవేడిగా సాగుతాయని తెలుస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా ప్రధానంగా నీటివాటాల కేటాయింపు అంశం మీద చర్చకు అధికార, ప్రతిపక్షపార్టీలు సిద్ధమయ్యాయి.
నగరంలో చలి తీవ్రత మరింత పెరిగింది. చీకటి పడగానే శీతల గాలులు గజగజ వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో అత్యల్పంగా 3 డిగ్రీలు..మిగిలిన ప్రాంతాల్లో 7 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.