Cold Wave Update: మంచు దుప్పటి కప్పుకున్ననగరం.... కనిష్ఠ స్థాయికి  ఉష్ణోగ్రతలు

నగరంలో చలి తీవ్రత మరింత పెరిగింది. చీకటి పడగానే శీతల గాలులు గజగజ వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో అత్యల్పంగా 3 డిగ్రీలు..మిగిలిన ప్రాంతాల్లో 7 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

New Update
FotoJet (36)

cold wave in telangana

Cold Wave Update: నగరంలో చలి తీవ్రత(cold wave in telangana districts) మరింత పెరిగింది. చీకటి పడగానే శీతల గాలులు గజగజ వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో చలి(cold wave alert in telangana) పులి పంజా విసురుతోంది.  పలు ప్రాంతాల్లో అత్యల్పంగా 3 డిగ్రీలు.. మిగిలిన ప్రాంతాల్లో 7 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. చలి గాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజులు చలి, పొగమంచు కొనసాగుతాయని వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతాయని అన్నారు. గత పదేళ్లలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి.  

ఉత్తర భారతం నుండి వీస్తున్న పొడి గాలుల కారణంగా రాష్ట్రంలో శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో మళ్లీ చలి తీవ్ర మొదలైంది. సోమవారం నుంచి నగరంలో చలి తీవ్రత పెరిగింది. దీంతో నగరవాసులు వణికపోతున్నారు.పొగమంచు కారణంగా తెల్లవారుజామున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  అలాగే హైదరాబాద్ నగరంలో ఉదయం పూట దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. నగరంలో ఉదయం, రాత్రి వేళల్లో చల్లటి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read :  నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..వాడీవేడిగా చర్చలు

చుట్టుముడుతున్న రోగాలు

వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పుల వల్ల ప్రజల రోగనిరోధక శక్తి క్షీణిస్తోంది. చలివాతావరణం కారణంగా అంటు వ్యాధులు విజృంభిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలివాళ్ల వరకు అంటు వ్యాధుల బారినపడుతున్నారు. జులుబు, దగ్గు వంటివి పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో చలిలో తిరగవద్దని వైద్య నిపుణులు జనానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  చిన్న పిల్లలు, వృద్ధులలో శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గిపోవడం వల్ల 'హైపోథెర్మియా' వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. - Cold Wave Grips Temperatures Drop In Across Telangana
 
అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున, రాత్రి 8 గంటల తర్వాత బయటకు రావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, గ్లౌజులు ధరించాలని సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ వేడిగా ఉండే ఆహారం, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని. రోగనిరోధక శక్తిని పెంచే అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు కోరుతున్నారు. చలి వల్ల చర్మం పొడిబారి పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాయిశ్చరైజర్లు లేదా కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిదని. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చలిలో అధిక శ్రమ చేయకూడదు. ఎందుకంటే చలి కాలంలో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Also Read :  మా డాడీ ఎవరో తెలుసా? అంటే కుదరదు.. మందుబాబులకు CP సజ్జనార్ వార్నింగ్!

Advertisment
తాజా కథనాలు