Bangladesh: భారత్‌పై విషం కక్కిన బంగ్లాదేశ్.. ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేస్తామంటూ హెచ్చరిక

హదీ హత్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇంకిలాబ్‌ మోంచా.. ఇప్పుడు భారతీయులపై విషం కక్కింది. బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారతీయుల వర్క్‌ పర్మిట్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది.  

New Update
Work permit cancellation for Indians in Bangladesh

Work permit cancellation for Indians in Bangladesh

బంగ్లాదేశ్‌(bangladesh) లో ఇంకిలాబ్ మోంచా నేత షరీఫ్ ఉస్మాన్ హదీ(osman hadi) ని హత్య చేయడంతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హదీ హత్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇంకిలాబ్‌ మోంచా.. ఇప్పుడు భారతీయులపై విషం కక్కింది. బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారతీయుల వర్క్‌ పర్మిట్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది.  అలాగే హదీ హత్యకు న్యాయం చేయాలంటూ కోరింది. హంతకులను, వారికి సహకరించిన వాళ్లని 24 గంట్లలోగా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేసింది. 

Also Read: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..మాజీ సర్పంచ్ ల ఆందోళన

Work Permit Cancellation For Indians

ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారతీయ వర్క్ పర్మిట్లను రద్దు చేయాలంది. షేక్ హసీనాకు అప్పగించేందుకు భారత్‌ నిరాకరిస్తే ఆ దేశంపై ఇంటర్నేషనల్‌ కోర్టులో కేసులు వేయాలని డిమాండ్ చేసింది. తమ అధికారికి ఫేస్‌బుక్ ఖాతాలో దీనిపై ఇంకిలాబ్‌ మోంచా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగానే సోమవారం పెద్దఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. 

Also Read: సిగరెట్ తాగేవారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిపోనున్న ధరలు!

ఇదిలాఉండగా డిసెంబర్ 12న ఉస్మాన్‌ హదీని ఢాకాలో దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. డిసెంబర్ 18న చికిత్స తీసుకుంటూ హదీ మృతి చెందాడు. ఈ మరణవార్త వినడంతో బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగాయి. మీడియా సంస్థలు, అవామీ లీగ్ కార్యాలయాలపై నిరసనాకారులు దాడులు చేశారు. అయితే హదీని చంపిన ఇద్దరు దుండగులు భారత్‌లోకి ప్రవేశించినట్లు బంగ్లాదేశ్‌ మీడియాలో వార్తలు రాగా.. భారత్ దీన్ని ఖండించింది. షేక్ హసీనా ప్రభుత్వం పడగొట్టడంలో హదీ కీలక పాత్ర పోషించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో కూడా అతడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే హదీని హత్య చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Advertisment
తాజా కథనాలు