Thalapathy Vijay: అభిమానుల అత్యుత్సాహం.. కిందపడిన విజయ్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

అభిమానుల అత్యుత్సాహంతో దళపతి, టీవీకే అధినేత విజయ్‌ చెన్నై విమానశ్రయంలో ఇబ్బంది పడ్డారు. విజయ్‌ని చూడడం కోసం అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో గందరగోళం నెలకొంది. విజయ్‌ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కిందపడ్డారు.

New Update
Vijay’s Jana Nayagan

Vijay’s Jana Nayagan

Vijay: అభిమానుల అత్యుత్సాహంతో  కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు, దళపతి, టీవీకే అధినేత విజయ్‌(thalapathy-vijay) చెన్నై విమానశ్రయం(chennai-airport) లో ఇబ్బంది పడ్డారు. తాజాగా మలేసియాలో జరిగిన ‘జన నాయగన్‌’(Vijay Jana Nayagan) ఆడియో లాంచ్‌ కార్యక్రమం ముగించుకుని ఆయన చెన్నై చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పోలీసులు వారిని కంట్రోల్‌ చేసినప్పటికీ కొందరు విజయ్‌ని చూడడం కోసం ముందుకు దూసుకువచ్చారు. ఎయిర్‌పోర్టులో గందరగోళం నెలకొంది. దీంతో విజయ్‌ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కిందపడ్డారు. పక్కనే ఉన్న సిబ్బంది ఆయన్ను సురక్షితంగా కారు ఎక్కించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.  ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.‘జన నాయగన్‌’ తన చివరి సినిమా అని విజయ్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

Also Read :  పిల్లల పెంపకంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

Thalapathy Vijay Falls At Chennai Airport

కాగా విజయ్‌(TVK President Vijay) ను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు విమానశ్రయానికి రావడం. విజయ్‌ కిందపడటంతో పోలీసులు ఆందోళనకు గురయ్యారు. గతంలో ఒక సభలో తొక్కిసలాట జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో మరోసారి  దాదాపు తొక్కిసలాట జరుగుతుందనేంత భయానక వాతావరణం నెలకొంది. అయితే.. ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. తమ హీరో క్షేమంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Also Read :  జేష్-ఏ-మహమ్మద్ భారీ కుట్ర.. PoKలో ట్రైనింగ్ క్యాంప్

తమిళ రాష్ట్రంలో దళపతికి మంచి క్రేజ్ ఉంది. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. అయితే.. జన నాయగన్ మూవీయే తనకు చివరిదని విజయ్ ప్రకటించడంతో అభిమానుల్లో హైప్ క్రియేట్ అయింది. చాలామంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ రాణించాలని కోరుతున్నారు. కాగా ఈ చిత్రం చివరిదని ప్రకటించడంతో  మలేషియాలోని ఓవెన్ స్టేడియంల్‌ నిర్వహించిన జన నాయగన్‌ ఆడియో లాంచ్ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఎప్పుడూ భావోద్వేగ ప్రసంగాలతో ఆకట్టుకునే విజయ్.. ఈసారి స్టేజీపై డ్యాన్స్ చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన హీరో ఆఖరి సినిమా కావడంతో.. మధుర జ్ఞాపకాలను మిగల్చడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు