/rtv/media/media_files/2025/12/29/fotojet-38-2025-12-29-12-09-48.jpg)
Telangana Assembly
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. ఈ సమావేశాలకు సీఎం రేవంత్‌రెడ్డి , ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. కేసీఆర్ వద్దకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అభివాదం చేసి బాగున్నారా అని పలకరించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు కలిసి కరచాలనం చేశారు.ఆయనకు పలకరించి అభివాదం చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.
కాగా సమావేశం అనంతరం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే బీఆర్‌ఎస్ అధినేత తిరుగుపయనమయ్యారు. సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కాగా.. ఈరోజు (సోమవారం) ఉదయం నందినగర్‌లోని నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా మాజీ సీఎంకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఆపై కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు సభలోకి తీసుకెళ్లారు. కేసీఆర్ వెళ్లిన కాసేపటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మిగతా సభ్యులు అందరికంటే ముందుగానే కేసీఆర్ వెళ్లి తన చైర్‌లో కూర్చున్నారు. ఆపై సభ ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే సభలో ఉన్నారు కేసీఆర్. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బయటికి వచ్చారు. అనంతరం అసెంబ్లీ నుంచి తిరిగి నందినగర్ నివాసానికి గులాబీ బాస్ వెళ్లిపోయారు.
జీహెచ్‌ఎంసీలో ఓఆర్‌ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్‌ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్‌టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ తదితర అంశాలకు చట్టబద్ధత కల్పించనున్నారు. తొలిరోజు సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. శాసనసభ, మండలి ఎన్నిరోజులపాటు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా సుదీర్ఘ విరామం తర్వాత సభకు హాజరైన కేసీఆర్ ఇవాళ సభలో జాతీయ గీతం, సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకం చేసిన కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా నందినగర్‍లోని తన నివాసానికి బయలుదేరారు. దీంతో మొదటి రోజు అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన కేసీఆర్ తీరు పట్ల ప్రత్యర్థులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అసెంబ్లీకి తొలి రోజు హాజరైన కేసీఆర్ తర్వాతి రోజుల్లో సభకు వస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.
Follow Us