Bhargavastra: భారత్ చేతిలో 'భార్గవాస్త్ర'.. టర్కీ డ్రోన్లు ఇక తుక్కు తుక్కే!
భారత రక్షణ వ్యవస్థలోకి మరో అధునాతన వ్యవస్థ వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భార్గవాస్త్ర పరీక్షలు విజయవంతం అయ్యాయి. ఈ భార్గవాస్త్ర డ్రోన్లను వెంటపడి నాశనం చేయనుంది. ఒకేసారి 64 లక్ష్యాలను ట్రాక్ చేసి.. దెబ్బకొట్టే సత్తా భార్గవాస్త్రకు ఉంది.