Women's Electric Scooters: మహిళల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ధర తక్కువ మైలేజ్ ఎక్కువ!

మహిళలకు కంఫర్టబుల్ ఫీలింగ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. TVS iQube S రూ.1.10 లక్షలు, Bajaj Chetak 35 Series రూ.1.15 లక్షలు, River Indie రూ.1.25 లక్షలు, Aether Rizta రూ.1.10 లక్షలు, Hero Vida V2 రూ.99,000 ధరను కలిగి ఉన్నాయి.

New Update
womens Best Electric Scooters

womens Best Electric Scooters

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. ఇంటి పనుల కోసం, పిల్లల్ని స్కూల్‌కి డ్రాప్ చేయడానికి, మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తేవడానికి, ఉద్యోగాలకు వెళ్లడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందులోనూ మహిళలే ఎలక్ట్రిక్ స్కూటీలను విపరీతంగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ సమయంలో మహిళలకు ఇవి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. అందువల్లనే చాలా మంది మహిళలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా మీ తల్లి కోసం మంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చూస్తున్నట్లయితే ఇదే సరైన అవకాశం. ఇక్కడ కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి. 

Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది

TVS iQube S

పనితీరు, మైలేజ్‌ను కోరుకునే వారికి TVS iQube S మంచి ఆప్షన్. దీని ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 100 కి.మీ. మైలేజీ అందిస్తుంది. గంటకు 78 కి.మీ గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. 

Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

Bajaj Chetak 35 Series

బజాజ్ చేతక్ 35 సిరీస్ స్కూటర్ మహిళలకు మంచి ఎంపిక. దీనిని రూ.1.15 లక్షలకు (ఎక్స్-షోరూమ్) వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్‌తో 113 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది గంటకు 73 కి.మీ గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. ఈ స్కూటర్ ప్రీమియం మెటల్ బిల్డ్, IP67-రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది, వివిధ వాతావరణ పరిస్థితులలో మన్నికను నిర్ధారిస్తుంది. దీని సొగసైన డిజైన్ మరియు సౌకర్యవంతమైన రైడ్ నాణ్యత చేతక్ వారసత్వాన్ని గౌరవించే తల్లులకు ఇది ఆకర్షణీయమైన బహుమతిగా నిలుస్తుంది. 

Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!

River Indie

రివర్ ఇండి నగర వీధులు, సెమీ-అర్బన్‌ ఏరియాల్లో అద్భుతంగా పరుగులెడుతుంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్2పై 120 కి.మీ మైలేజీ అందిస్తుంది. గంటకు 90 కి.మీ గరిష్ట వేగంతో పరుగులు పెడుతుంది. దీనిని రూ.1.25 లక్షలకు (ఎక్స్-షోరూమ్) కొనుక్కోవచ్చు. 

Aether Rizta

ఏథర్ రిజ్టా భద్రతకు మంచి ప్రాధాన్యతను ఇచ్చే కుటుంబాలను ఆకర్షిస్తుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 125 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది గంటకు 80 కి.మీ గరిష్ట వేగంతో రయ్ రయ్ మంటూ పరుగులు పెడుతుంది. దీని ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్ విశాలమైన సీటు, విశాలమైన ఫుట్‌బోర్డ్, పెద్ద బూట్ స్పేస్‌తో విభిన్నంగా ఉంటుంది. 

Hero Vida V2

Hero Vida V2 ఎలక్ట్రిక్ స్కూటర్ మహిళలకు తక్కువ ధరలో దొరికే అద్భుతమైన స్కూటర్. ఇది రూ.99,000 (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. హీరో విడా V2 110 కి.మీ మైలేజీని అందిస్తుంది. గంటకు 65 కి.మీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్ ఉంది.

latest-telugu-news | telugu-news | electric-scooter | electric scooter offers

Advertisment
Advertisment
తాజా కథనాలు